ఆంజనేయస్వామి ఎంత శక్తి వంతుడో మన అందరికి తెలుసు.అయన శక్తి ముందు అందరూ తలా దించాల్సిందే.
ఆంజనేయ స్వామిని ముక్కని వారు ఉండరు.దాదాపు అన్ని గ్రామాల్లో ఆంజనేయ గుడి ఖచ్చితంగా ఉంటుంది.
ఇంకా అలాంటి ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరు తమలపాకులు, వడమాల, సింధూరంతో పూజిస్తారు.
ఇంకా అందులో తమలపాకుల మాలతో అర్చన ఎందుకు అనే విషయం గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం… సీతమ్మ తల్లిని రావణుడు అపహరించి తన లంకలో పెట్టిన సంగతి తెలిసిందే కదా.
ఇంకా ఆ సమయంలోనే రాముడు సీతమ్మ కోసం అనేవిశిస్తున్న సమయంలో ఆయనకు సహాయంగా ఉన్న ఆంజనేయుడు అశోకవనంకు చేరుకున్నాడు.
ఇంకా అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్నీ శ్రీరాముడుతో చెప్పాలని అక్కడినుండి బయలుదేరుతాడు.
అయితే ఆ సమయంలోనే సీతమ్మ ఆంజనేయుడిని ఆశీర్వదించాలనుకుంటుంది.కానీ అక్కడ చుట్టుపక్క ఎక్కడ సీతమ్మకు పూలు దొరకవు.
దీంతో పువ్వులకు బదులుగా సీతమ్మ తమలపాకులను కోసి ఆంజనేయుని తలమీద పెట్టి దివిస్తుంది.అంతేకాదు.
ఆంజనేయుడు ఆకాశంలో ఎగిరి గట్టిగా హూంకరిస్తాడు.
ఇంకా ఇది విన్న వానరాలు ఆంజనేయుడు సీతమ్మ జాడ ఖచ్చితంగా తెలుసుకున్నాడు అని అర్థం చేసుకొని వానరులంతా ఆంజనేయుడికి తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు.
ఇంకా ఇది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగిపోతారు.ఇక అప్పటి నుండి ఆంజనేయుడుకు తమలపాకులతో అర్చన చేస్తారు.