మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అంటే మెగా ఫ్యాన్స్‌లో ఎలాంటి అంచనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే.కాగా చరణ్ నటించిన పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నడుమ రిలీజ్ కావడంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ అనుకున్నారు.
కానీ ఈ సినిమా రిజల్ట్ డిజాస్టర్‌గా మిగలడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అయతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత డిజాస్టర్‌గా మిగిలిందో బుల్లితెరపై అంతే బ్లాక్‌బస్టర్‌గా మారింది.
ఈ సినిమాను టెలికాస్ట్ చేసిన ప్రతిసారి అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.తాజాగా మే 23 – మే 29 మధ్యలో ఈ సినిమాను టెలికాస్ట్ చేయగా దీనికి ఏకంగా 7.97 రేటింగ్ రాగా ఇది టాప్ పొజిషన్‌లో నిలిచింది.ఇలా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన వినయ విధేయ రామ, బుల్లితెరపై మాత్రం రెచ్చిపోయాడు.
బోయపాటి మాస్ టేకింగ్‌కు చరణ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ తోడవడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
కాగా ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.