ప్రస్తుత కాలంలో కొందరు క్షణికావేశానికి లోనై శారీరక సుఖం కోసం చేసేటువంటి పనుల కారణంగావ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.తాజాగా ఓ యువతి పెళ్లి కాకుండానే 23 సంవత్సరాల వయసులో ప్రేమలో పడి గర్భం దాల్చగా చివరికి తనకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి కావాలంటూ కోర్టును ఆశ్రయించిన ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి ఓ యువతి ముంబై నగర పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తితో ప్రేమలో పడింది.
ఈ ప్రేమ మైకంలో ఇద్దరూ ఎన్నో హద్దులను కూడా దాటేశారు.దీంతో యువతి గర్భం దాల్చింది.
కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 20 వారాలలోపు యువతి అబార్షన్ చేయించుకోలేక పోయింది.దీంతో ఇటీవలే తనకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి కావాలంటూ బాంబే కోర్టుని ఆశ్రయించింది.
ఇందులో భాగంగా భాగంగా ప్రస్తుతం తాను ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా బిడ్డకు జన్మనివ్వ లేనని, కాబట్టి తనకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతులు జారీ చేయాలని కోర్టు వారికి తన వాదన వినిపించింది.దీంతో యువతి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మరియు సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోర్టువారు యువతికి అబార్షన్ చేయించుకునేందుకు అనుమతులు జారీ చేశారు.
సాధారణంగా అయితే గర్భందాల్చిన 12 వారాల లోపు వైద్యుల సలహా మేరకు అబార్షన్ చేయించుకోవచ్చు.