పెళ్లి విషయంలో నిఖిల్ ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదుగా!

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు.ఈ హీరో ప్రస్తుతం తన కెరీర్ బెస్ట్ చిత్రం కార్తికేయకు సీక్వెల్‌ను రెడీ చేసే పనిలో పడ్డాడు.

 Nikhil, Wedding, Pallavi, Karthikeya 2, Tollywood Movie News-TeluguStop.com

ఇప్పటికే కార్తికేయ 2 చిత్రం షూటింగ్‌ను ప్రారంభించిన నిఖిల్, తన వ్యక్తిగత జీవితంలోనూ మరో ఘట్టానికి చేరుకున్నాడు.తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిఖిల్ రెడీ అయ్యాడు.

భీమవరంకు చెందిన డాక్టర్ పల్లవిని గతకొంతకాలంగా ప్రేమిస్తున్న నిఖిల్, ఏప్రిల్ 16న ఆమెను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు.

కానీ కరోనా వైరస్ మహమ్మారి నిఖిల్ పెళ్లికి అడ్డంకిగా మారింది.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో నిఖిల్ పెళ్లి వాయిదా పడింది.దీంతో నిఖిల్ చాలా బాధపడ్డాడు.

కాగా తన పెళ్లి తేదీని మే 14కు వాయిదా వేసుకున్నాడు.అప్పటివరకు లాక్‌డౌన్ ఎత్తివేస్తారని, తన పెళ్లిని కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా చేసుకోవచ్చిన భావించాడు.

కానీ నిఖిల్ పెళ్లి ఆశలపై మరోసారి కరోనా వైరస్ నీళ్లు పోసింది.

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మూడో దశ లాక్‌డౌన్‌ను ప్రకటించడం, మే 17 వరకు దీన్ని పొడిగించడంతో నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా పడనుంది.

ఇలా వరుసగా రెండుసార్లు తన పెళ్లి వాయిదా పడటంతో నిఖిల్‌కు చిర్రెత్తుకొచ్చింది.ఏదేమైనా లాక్‌డౌన్ తరువాత ఘనంగా పెళ్లి చేసుకునేందుకు నిఖిల్ రెడీ అవుతున్నాడు.పెళ్లి తరువాత తన సన్నిహితులకు, స్నేహితులకు ఘనంగా పార్టీ ఇచ్చేందుకు నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube