ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్న క్షేత్రంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.శ్రీవారి పాదాల చెంతకు స్వామి వారి తిరునామాలతో ఒక గోవు దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది.
వింత సంఘటన చోటు చేసుకుంది.కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న గోవులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ రోజూ గ్రాసం అందిస్తోంది.
దీంతో గోవులన్నీ కడుపు నింపుకుంటున్నాయి.ఈ క్రమంలోనే అక్కడకి వచ్చిన గోవుల్లో ఒక గోవు నుదిటిపై శ్రీవారి తిరునామాలు ఉండడాన్ని టీటీడీ అధికారులు గుర్తించారు.
అలిపిరి వద్ద ఈ గోవు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.నుదుటిపై ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి ధరించే తిరునామం మాదిరిగానే ఈ గోవుకు కూడా నుదుటిపై పెద్ద ఆకారంలో సహజసిద్ధంగా కలిగి ఉండడం అందరినీ ఆకట్టుకుంటుంది.
అయితే తిరునామం ధరించిన ఇలాంటి అరుదైన గోవును టీటీడీ అధికారులు గోశాలకు తరలిస్తే భక్తులు వీక్షించడానికి బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేయటంతో, నామాల గోవును టీటీడీ అధికారులు గోశాలకు తరలించినట్లుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే, గత 45 రోజులుగా కరోనా మహమ్మారి వల్ల శ్రీవారి ఆలయం లో భక్తుల దర్సనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఆలయం కూడా లాక్ డౌన్ సమయం మూసే ఉంచనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఒకవేళ లాక్ డౌన్ గనుక ఎత్తివేస్తే తిరిగి యధావిధిగా ఆలయం స్వామి దర్శనార్ధం ఎప్పుడూ తెరిచే ఉంచనున్నట్లు తెలుస్తుంది.
గత 45 రోజులుగా ఆలయం మూసి ఉంచడం తో స్వామి వారి ఆదాయానికి భారీగా గండి పడింది. దేశంలోనే ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జించే పుణ్యక్షేత్రాల్లో తిరుమల కూడా ఒక్కటి.
కానీ ఈ కరోనా ప్రభావం తో గత 45 రోజులుగా భక్తులు రాకపోకలు లేకపోవడం తో దాదాపు ఈ పుణ్య క్షేత్రానికి 300 కోట్ల మేరకు ఆదాయం గండి పడినట్లు తెలుస్తుంది.
సాధారణంగా ఈ కాలానికి తిరుమలకు రూ.300 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉండేదని ఒక అంచనా. హుండీ లో భక్తులు వేసే కానుకలు, కాటేజీల అద్దెలు తదితర రూపాలలో ఈ ఆదాయం వస్తుంటుంది.
ఇప్పుడు ఆదాయానికి గండిపడింది.కరోనా ఎఫెక్ట్ సాధారణ పబ్లిక్‌తో పాటు దేవుళ్ల కు కూడా తప్పడం లేదు.