పాఠాలకు బదులుగా శృంగార పాఠాలు చెబుతున్న స్కూల్ టీచర్....

విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచి పథంలో నడిపించాల్సిన గురువే గాడి తప్పి ప్రవర్తించి ఉపాధ్యాయుడు అన్న పదానికి తెచ్చాడు.తాజాగా బడిలో పాఠాలు చెప్పాల్సిన బడిపంతులు పిల్లలకి అశ్లీల శృంగార వీడియోలు చూపిస్తూ వారిని బుట్టలో వేసుకునేందుకు ఇచ్చినటువంటి ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 School Teacher Arrested In Maharashtra-TeluguStop.com

వివరాల్లోకి వెళితే తే రాష్ట్రంలోని స్థానిక ఔరంగాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓ ఉపాధ్యాయుడు స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.అయితే ఇతడికి మొదటినుంచి కామవాంఛలు ఎక్కువగానే ఉండేవి.

దీంతో ఈ కామ వాంఛలను తీర్చుకునేందుకు తాను పని చేసేటువంటి స్కూలులో చదువుతున్న విద్యార్థులపై కన్నేశాడు.ఈ క్రమంలో ఎనిమిదో తరగతి చదువుతున్న టువంటి బాలికలను స్పెషల్ క్లాస్ నిమిత్తమై గదిలోకి తీసుకెళ్లి తన ఫోన్లో ఉన్నటువంటి అశ్లీల చిత్రాలు మరియు శృంగారభరిత వీడియోలను విద్యార్థులకు చూపించి లైంగికంగా వేధించేవాడు.

అంతేగాక ఈ విషయం గురించి బయట ఎవరికైనా చెబితే తక్కువ మార్కులు వేసి ఫెయిల్ చేస్తారని బెదిరించేవాడు.

Telugu Maharashtra, School Teacher, Schoolteacher-General-Telugu

దీంతో విద్యార్థులు భయపడి కిక్కురుమనకుండా ఉండిపోయారు.అయితే ఓ విద్యార్థిని ధైర్యం చేసి తమ ఉపాధ్యాయుడు చేసేటటువంటి ఆకృత్యాల గురించి తన తల్లిదండ్రులతో చెప్పింది.విషయం తెలుసుకున్న టువంటి విద్యార్థిని తల్లిదండ్రులు వెంటనే స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వారు పోలీసులను పిలిపించి సదరు ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు నమోదు చేశారు.

ఫిర్యాదు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube