ఏపీ సీఎం జగన్ చేస్తున్న పరిపాలన అంతా అస్థవ్యస్థంగా ఉందంటూ బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు.రాష్ట్రంలో పరిశ్రమల కల్పనకు కృషి చేయాల్సింది పోయి ఉన్న వాటిని పోగొట్టే పరిస్థితికి తీసుకు వచ్చాడంటూ ఆయన ఆరోపించాడు.
రాజధాని విషయం ఇతరత్ర విషయాల వల్ల రాష్ట్ర బ్రాండ్ వాల్యూ పడిపోయిందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.రాష్ట్రంకు ఇవి చీకటి రోజులు.
జగన్ సీఎం అయినప్పటి నుండి రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయంటూ ఆరోపించాడు.
గతంలో కశ్మీర్, బీహార్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వచ్చేవారు కాదు.
కాని ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు భయపడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.జగన్ అనాలోచిత నిర్ణయాలు మరియు అనుభవరాహిత్య పనుల వల్ల చాలా నష్టం జరుగుతుందని బైరెడ్డి ఆరోపించాడు.
రాజధాని విషయంలో తలా తోక లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్న ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్తారంటూ హెచ్చరించాడు.