భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Rrr Pre Release Business Rs 200 Cr-TeluguStop.com

ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.200 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోందట.బాహుబలి-2 కంటే కూడా ఇది ఎక్కువ మొత్తం అని చెప్పాలి.ఇంతటి స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే ప్రథమం అని అంటున్నారు సినీ జనం.

ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ అదరగొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.తెలుగు సినీ చరిత్రలో ఈ సినిమా చేసిన ప్రీరిలీజ్ బిజినెస్ మరే ఇతర సినిమా చేయకపోవచ్చని అంటున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube