ఒక్క చెంప దెబ్బ కొట్టినందుకే విడాకులిచ్చేసిన తాప్సి...

ఎప్పుడు విభిన్న కథనాలు ఎంచుకుంటూ, కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతూ, ఎటువంటి పాత్రల్లోనైనా చక్కగా ఒదిగిపోయేటువంటి నటి తాప్సీ.

అయితే తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా ఉంటోంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం తాప్సీ  ప్రముఖ  వినూత్న దర్శకుడు అనుభవ సిన్హా దర్శకత్వం వహించినటువంటి థప్పడ్ అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 2.54 నిమిషాల నిడివిగల ట్రైలర్ ని  చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.ఈ చిత్రంలో తాప్సి ఇంటిని చక్కదిద్దే ఓ మంచి గృహిణిగా నటించింది.

అయితే ఇంట్లో అంతా సంతోషంగా ఉన్న సమయంలో భర్త చేతిలో అనుకోకుండా ఓ చెంపదెబ్బ తింటుంది.దీంతో ఏకంగా తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయిస్తుంది.అయితే కోర్టులో తన భర్త నుంచి విడిపోవడానికి తనకు ఎటువంటి వ్యక్తిగత కారణాలు లేవని కేవలం తన భర్త తనని కొట్టడం వల్ల మాత్రమే విడాకులు కావాలని అంటుంది.

అయితే మధ్యలో ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.అయితే ఈ చిత్రంఫిబ్రవరి 28వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Advertisement

అయితే మొత్తానికి చిత్ర ట్రైలర్ పరంగా చూసుకుంటే తాప్సి నటనకు వందకి వంద శాతం మార్కులు పడ్డాయి.అంతేగాక ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసి రెండు గంటలు కూడా గడవక ముందే దాదాపు ఐదు లక్షలు వ్యూస్ వచ్చాయి.దీంతో ధప్పడ్ చిత్ర యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాప్సీ తన తదుపరి చిత్రం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వినిల్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్న టువంటి హసీన్ దిల్రుబా అనే చిత్రంలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు