తెలుగులో చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తూ తన కామెడీతో ప్రేక్షకులను అలరించే అటువంటి కరాటే కళ్యాణి గురించి తెలియని వారుండరు.ఈమె నటించిన టువంటి పలు కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ గుర్తొస్తే ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు.
అయితే తాజాగా కరాటే కళ్యాణి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది.
తాజాగా కరాటే కళ్యాణి టీవీ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా గత కొద్ది కాలంగా తనకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన వాట్సాప్ నంబర్ కి అశ్లీల వీడియోలు మరియు అసభ్య పదజాలం ఉపయోగించి వాయిస్ మెసేజ్ లు పంపిస్తున్నారని వాపోయారు.అంతేగాక ఈ విషయమై ఇప్పటికే దగ్గరలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు.
అయితే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఈ వాయిస్ మెసేజ్ లు, అశ్లీల వీడియోలు రావడం కొంత మేర తగ్గాయని అన్నారు.కానీ సోషల్ మీడియా మాధ్యమాల్లో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి పోస్ట్ చేస్తున్నారని దీనివల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు.
అంతేగాక తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపుల విషయంపై కూడా స్పందించారు.బయట చెప్పుకునేంతగా సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు లేవని, ఎవరో కొంతమంది మాత్రమే ఎదుర్కొన్నారని అంతేగాక ఇకపై భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు కానీ మరీ అసభ్య ప్రవర్తనలు ఎదుర్కుంటే ధైర్యంగా మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేయవచ్చని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.