ప్రముఖ ప్రయాణ సేవల సంస్థ ఉబర్ టెక్నలాజీస్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కో ఫౌండర్ ట్రావిస్ కలానిక్ ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హోదా నుంచి తప్పుకున్నారు.ఉబర్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ట్రావిస్.
తన వ్యూహ చతురతతో కంపెనీని స్టార్టప్ స్థాయి నుంచి ఎంఎన్‌సీగా మార్చారు.ఇటీవలే ఉబర్‌లోని మొత్తం షేర్లను విక్రయించిన ఆయన కొత్త వ్యాపారంపై దృష్టి పెడుతున్నట్లు ప్రకటించారు.
లాస్ ఏంజెల్స్‌లో పుట్టిన ట్రావిస్ కలానిక్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసి రంగంలోకి దిగారు.1998లో తొలి స్టార్టప్‌ను పెట్టినప్పటికీ అది నష్టాల పాలవ్వడంతో మధ్యలోనే వదిలేశారు.ఈ సమయంలో మిత్రుడు గారెట్ క్యాంప్ ట్యాక్సీలను పట్టుకోవడం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉబెర్ ఆలోచనకు శ్రీకారం చుట్టింది.అలా ఇద్దరూ కలిసి 2010లో ఉబెర్ టెక్నలాజీస్ను స్థాపించారు.
ఫోన్లో క్లిక్ చేస్తే చాలు ఇంటి ముందుకు క్యాబ్ రావడం ప్రజలకు సరికొత్త అనుభూతిని ఇవ్వడంతో కలానిక్ వెనుదిరిగి చూసుకోలేదు.

అంచెలంచెలుగా ఎదిగిన ఉబెర్… అమెరికాలో ఫేస్బుక్ తర్వాత ఐపీవోకు వెళ్లిన కంపెనీగా రికార్డు సృష్టించింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 63 దేశాల్లో ప్రతి ఏటా 77 వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధిస్తూ ఎనిమిదేళ్లలో 4.76 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగా చరిత్ర సృష్టించింది.దీని వెనుక కలానిక్ స్ట్రాటజీ, వ్యాపార నైపుణ్యాలు, నిరంతర శ్రమ దాగివుంది.అయితే కంపెనీలో అంతర్గతంగా జరుగుతున్న లైంగిక వేధింపులు, అనైతిక కార్యకలాపాలపై పెర్కిన్స్ కోయి , కోవింగ్టన్ అండ్ బుర్లింగ్లు లోతైన విచారణ జరపడంతో ఈ ఏడాది ఆగస్టులో కలానిక్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
అయితే అప్పటి నుంచి ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు.ఉబెర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే భారత్‌లోని క్లౌడ్ కిచెన్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టాలని కలానిక్ భావిస్తున్నారు.