డానిష్ కనేరియాపై వివక్ష చూపించేవారు... షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

ఇండియాలో మైనార్టీగా ఉన్న ముస్లిం వర్గాల మీద అంతగా వివక్ష ఉండదు.అందరితో పాటు వారు కూడా అన్ని రంగాలలో రాణిస్తారు.

 Pakistan Playersmistreated Danish Kaneria-TeluguStop.com

ప్రభుత్వం వారికి మంచి గుర్తింపు ఇస్తుంది.అలాగే క్రికెట్ లో కూడా ముస్లిం క్రికెటర్స్ గా చాలా ప్రాధాన్యత లభించింది.

అయితే పాకిస్తాన్ లాంటి మతతత్వ దేశంలో మైనార్టీగా ఉన్న హిందువుల పరిస్థితి ఘోరం అని చెప్పాలి.అక్కడ వారికి ఎలాంటి హక్కులు ఉండవు.

ప్రభుత్వంతో పాటు, అందరూ మైనార్టీ హిందువులని తక్కువ చేస్తూ ఉంటారు.వారికి అవకాశాలు రాకుండా అడ్డుకుంటారు.

అయితే పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఆ దేశం తరుపున క్రికెట్ ఆడిన ఒకే ఒక వ్యక్తి డానిష్ కనేరియా.ఈ బౌలర్ క్రికెట్ లో పాకిస్తాన్ ని ఎన్నో విజయాలు అందించారు.

అయితే తాజాగా డానిష్ కనేరియా గురించి పాకిస్తాన్ ఒకప్పటి ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికరమైన వాస్తవాలు చెప్పారు.డానిష్ కనేరియా టీమ్ లో ఉన్నప్పుడు అతని మీద చాలా వివక్ష ఉండేదని చెప్పుకొచ్చారు.

అతను హిండువనే ఒకే కారణంగా టీమ్ లో చాలా మంది అతనితో పెద్దగా మాట్లాడేవారు కాదని, అలాగే అతనితో కలిసి భోజనం కూడా చేసేవారు కాదని అన్నారు.ఈ విషయంపై చాలా సార్లు తాను టీమ్ ఆటగాళ్ళతో గొడవ పడ్డానని చెప్పాడు.

అలాగే అతను ఎన్నో విజయాలు అందించిన అతన్నిఅభినందించేందు ఇష్టపడేవారు కాదని అన్నారు.ఇక ఈ విషయంపై డానిష్ కనేరియా స్పందించారు.

అతను చెప్పిన విషయాలు వాస్తవమే అని, తాను హిందువు కావడంతో సహచరులు తనపై వివక్ష చూపించారని తెలిపారు.అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం బెటర్ అని దీనిని తాను రాజకీయం చేయాలని కోరుకోవడం లేదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube