బోయపాటి శ్రీను,బాలయ్య కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమాలు సింహ, లెజెండ్.ఈ రెండు చిత్రాలు ఎంతగా హిట్ కొట్టాయో అందరికీ తెలిసిందే.
అయితే వీరి కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతుండగా ఆ చిత్రంలో క్రేజీ హీరోయిన్ ను బాలయ్య బాబుకు జోడి గా తీసుకున్నారు.జనవరి 3 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అన్న ఊహాగానాలకు తేర దించుతూ కేథరిన్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది.
గతంలో బోయపాటి,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు చిత్రంలో కూడా కేథరిన్ ఎమ్మెల్యే పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో కూడా బోయపాటి కేథరిన్ నే తీసుకోవడం విశేషం.
మరి కేథరిన్ లో ఏ టాలెంట్ చూసి దర్శకుడు వరుసగా సినిమాల్లో తీసుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు బాలయ్య కు జోడి గా మాత్రం బోయపాటి చిత్రం లో కేథరిన్ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.మూడో సినిమాకు ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.సరైనోడు చిత్రం హిట్ కొట్టినప్పటి నుంచి కెథరిన్ త్రెసాను మరో సినిమాలో తీసుకోవాలని అనుకొంటుంటాగా ఇప్పుడు బాలయ్య సినిమాలో అవకాశం ఇచ్చారు.కేథరిన్ త్రెసా యాక్టింగ్ తో పాటు గ్లామర్ షోకు కూడా ఏ మాత్రం వెనకడుగు వేయదు.అందుకే ఆమెను తీసుకున్నారని సమాచారం.