అమెరికాలో ఘోరం...బిస్కట్ తిన్నందుకు జైల్లో పెట్టారు..!!!

అమెరికాలో జరిగిన ఈ సంఘటన అందరిని నోళ్ళు వెళ్ళబెట్టేలా చేసింది.అమెరికాకి చెందిన గ్రెగరీ ఫీల్డ్స్ అనే వ్యక్తి అడగకుండానే బిస్కెట్ తిన్నాడనే కారణంగా ఆరునెలలు జైలు శిక్ష విధించిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Eating Leftover Cookie California-TeluguStop.com

ఇది చదివిన నెటిజన్లు దీనికి కూడా శిక్ష విధిస్తారా అనే తిట్టిపోస్తున్నారు.అసలు ఏమి జరిగింది.

బిస్కెట్ తింటేనే జైల్లో పెట్టడం ఏమిటి అనే వివరాలోకి ఒక సారి వెళ్తే.

ది సాల్వేషన్ ఆర్మీ హార్బర్ అనే ఓ రీహబిలిటేషన్ సెంటర్ లో వైద్య చికిత్స నిమ్మిత్తం గ్రెగరీ అనే వ్యక్తి వచ్చాడు.

అందరూ తినగా ఒక బిస్కెట్ మిగిలి ఉండటం చూసి దాని తీసుకుని తిన్నాడు.తినీ తినగానే ఒక్క సరిగా అతడిని ఆ సెంటర్ అధికారులు తిట్టిపోశారు.అంతేకాదు అతడిపై ఆగ్రహించి అతడిని ట్రీట్మెంట్ తీసుకోకుండా బహిష్కరణ చేశారు.అతడు తన కుటుంభం, స్నేహితులు కలవకుండా ఉండాలని ఆదేశించారు.

అలా అయితేనే మళ్ళీ తనకి ట్రీట్మెంట్ మొదలవుతుందని అతడి తరుపు లాయర్ గ్రెగరీ కి చెప్పాడు.

Telugu Calinia, Caliniajailed, Leftover Cookie, Telugu Nri Ups-

అయితే వారి షరతులు అంగీకరించని అతడు తమ కుటుంభం వద్దకి మధ్యలోనే వెళ్ళిపోయాడు.అయితే మూడు నెలల తరువాత మళ్ళీ రీహబిలేషన్ సెంటర్ లో జరగబోతున్న ఓ కార్యక్రమానికి హాజరవ్వాలని గ్రెగరీ ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు.అతడు అనుమతి లేకుండా బిస్కెట్ తీసుకున్నాడు అంటూ కేసు పెట్టడమే కాకుండా కోర్టులో హాజరుపరుచగా మళ్ళీ మొదటి నుంచీ ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.

డానికి గ్రెగరీ నిరాకరించడంతో న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.దాంతో సోషల్ మీడియాలో గ్రెగరీ కి మద్దతుగా నిలిచారు నెటిజన్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube