గత ఏడాది రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ చిత్రాన్ని తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్నాడు.టాలీవుడ్ టాప్ 3 చిత్రంగా రంగస్థలంను నిలబెట్టిన దర్శకుడు సుకుమార్ తదుపరి చిత్రం విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
గత ఏడాది ఆరంభంలో రంగస్థలం వచ్చింది, ఈ ఏడాది పూర్తి కావస్తుంది.వచ్చే ఏడాదిలో సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంటే దాదాపు రెండున్న ఏళ్ల గ్యాప్ తర్వాత సుకుమార్ సినిమాను విడుదల చేయబోతున్నాడు.ఒక హిట్ దర్శకుడు ఇంత సమయం వృదా చేసుకోవడం దారుణం.
సమయం వృదా అయినా సక్సెస్ కొట్టాలని సుకుమార్ చాలా పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉన్నాడు.సుకుమార్ గత చిత్రం రంగస్థలం 1980 కాలం పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కింది.ఇప్పుడు అదే తరహా ఫార్ములాతో అల్లు అర్జున్‌తో సినిమాను చేసేందుకు సుకుమార్ సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక అడవి పక్కన ఉండే పల్లెటూరు చుట్టు ఈ చిత్రం కథ తిరుగుతుందని అంటున్నారు.
అల్లు అర్జున్ చదువుకున్న వ్యక్తిగా కనిపించబోతున్నాడు.ఇక హీరోయిన్ పాత్ర చదువుకోని పల్లెటూరు గడుసు అమ్మాయిగా కనిపించబోతుంది.

ఇప్పటికే హీరోయిన్‌గా రష్మిక మందనను దాదాపుగా కన్ఫర్మ్ చేశారు.అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.మహేష్‌బాబుతో సరిలేరు నీకెవ్వరు చేస్తున్న కారణంగా ఆమెకు అల్లు అర్జున్‌తో కూడా ఛాన్స్ వచ్చి ఉంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక రంగస్థలం చిత్రంలోని సమంత పోషించిన రామలక్ష్మి పాత్రకు చాలా దగ్గరగా బన్నీ సినిమాలో రష్మిక పోషించబోతున్న పాత్ర ఉంటుందని అంటున్నారు.
సమంత ది బెస్ట్ నటనను రంగస్థలంలో చూపించింది.మరి అలాంటి నటన రష్మికకు చేతనవుతుందా అనేది చూడాలి.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో బన్నీ, సుక్కుల మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.