లోక్ సభ లో త్రిపుల్ తలాక్ బిల్లు...వ్యతిరేకించిన ఆ రెండు పార్టీలు

ఇటీవల పార్లమెంట్ లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును సభలో ప్రవేశపెట్టింది.

 Triple Talaq Bill In Lok Sabha1 1 1-TeluguStop.com

తలాఖ్ అని మూడుసార్లు చెప్పి భార్యకు విడాకులు ఇచ్చేసినట్లే అంటూ ఉన్న ముస్లిం సంప్రదాయానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టె క్రమంలో ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు ఉండబోతుంది.ప్రధాని మోదీ ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటి కావడం తో ఈ బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టారు.

అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించినట్లు తెలుస్తుంది.

ఈ బిల్లు ముస్లిం మహిళల్ని కించపరిచేదిలా ఉందని ఎం ఐ ఎం పార్టీ అధినేత ఒవైసీ వాదిస్తుండగా,మరోపక్క ఇది మహిళలకు ఎలాంటి రక్షణా కల్పించట్లేదంటూ కాంగ్రెస్ వాదిస్తుంది.

కాంగ్రెస్ కేరళ ఎంపీ శశి థరూర్ మొదటిగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.ప్రత్యేక వర్గపు మహిళల్ని కాకుండా… అందరికీ ప్రయోజన కలిగించే విధంగా బిల్లు తేవాలని ఆయన కోరారు.

-Political

జూన్ 12న కేంద్ర కేబినెట్ ఈ బిల్లును ఆమోదించగా, ఇప్పుడు లోక్ సభ లో ప్రెవేశపెట్టి ఇతర పార్టీల ఆమోదం కోసం కేంద్రం ఎదురుచూస్తుంది.అయితే ఈ బిల్లు చట్టమైతే, ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాఖ్ చెప్పడం నేరమవుతుందన్నమాట.ఒకవేళ అలా చెప్పి విడాకులు ఇచ్చేశామని అనుకుంటే ఇక వారు మూడేళ్లు జైలు శిక్ష అనుభవించక తప్పదు.అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇలా భర్తను జైలు లో పెట్టడం వంటి చర్యల వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఎక్కడ ఏర్పడుతుంది అని, ఆ మూడేళ్లు భార్య బాగోగులు ఎవరు చూసుకుంటారు అంటూ కాంగ్రెస్,ఎం ఐ ఎం పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube