రామ్ చరణ్,ఎన్ఠీఆర్ ప్రధాన పాత్ర దారులుగా దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎంతో ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’.
ఈ చిత్రం ముహూర్త సమయమే బాలేదో ఏమోగానీ ఎప్పుడూ ఈ చిత్రానికి ఎదో ఒక అవతారం వచ్చిపడుతుంది.ఈ చిత్ర మొదటి షెడ్యూల్ సమయంలో హీరో రామ్ చరణ్ కు గాయం కాగా,దానితో కొంచం సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది.
అయితే కొద్దీ రోజుల తరువాత జూనియర్ ఎన్ఠీఆర్ కి కూడా చేతికి గాయం కావడం తో మరికొన్ని రోజులు షూటింగ్ ని ఆపేయాల్సి వచ్చింది.ఇప్పుడిప్పుడే ఆ గాయాల నుంచి బయటపడ్డ టీమ్ రెండవ షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ సమయంలో ఆ చిత్రానికి మరోసారి అవరోధం ఏర్పడింది.
ఈ చిత్ర హీరోయిన్ అయినా అలియా భట్ గాయం పాలైనట్లు తెలుస్తుంది.
వారణాసిలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ సమయంలో అలియా భట్ పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో బాధపడి.
వెంటనే అమెరికా వెళ్లిపోయిందని సమాచారం.దీనితో ఆమె అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా నేపథ్యంలో ఆమె ట్రీట్మెంట్ అనంతరం ‘బ్రహ్మాస్త్ర’, ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో పాల్గొంటానని దర్శక ధీరుడు రాజమౌళి కి మెసేజ్ పెట్టడం తో ఇప్పుడు టీమ్ ఆలోచన లో పడింది.
ఇప్పటికే లేట్ అవుతూ వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’కు ఇప్పుడు అలియా భట్ రూపంలో మరో దెబ్బ పడింది.