అమెరికాలోని తెలుగు సంఘాలలో అతి పెద్ద సంఘంగా, ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టి అమెరికాలోని తెలుగు వారికి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ప్రజలకి విశేష సేవలందిస్తున్న తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) రెండేళ్ళకోసారి నిర్వహించే మహాసభలకి ముందు అమెరికాలోని అన్ని నగరాల్లో తానా ధీంతానా కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఈ తానా ధీంతానా కార్యక్రమం వర్జీనియాలో జూన్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నదని సంస్థ తెలిపింది.
ఈ ధీంతానాకు సాయిసుధ పాలడుగు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.సోలోసింగింగ్, గ్రూపు డ్యాన్సింగ్, కపుల్ డ్యాన్స్, మిస్ టీన్ తానా, మిస్ తాన, మిసెస్ తానా, విభాగాల్లో పోటీలు జరుగుతాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు.
అన్ని వయసుల వారికి తగ్గట్టుగా విడివిడిగా పోటీలు జరుగుతాయని, వివిధ నగరాల్లో పోటీలను నిర్వహించిన తరువాత ఫైన్ పోటీలని తానా కాన్ఫరెన్స్ వేదికపై జూలై 4, 5,6 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు.మరిన్ని వివరాలకి ఈ కార్యక్రమానికి సంభందించి విడుదల చేసిన ఫ్లయర్‌ను చూడవచ్చు.