యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది.అందుగో, ఇదుగో అంటూ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతూ వస్తున్నాయి.
అయితే పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ప్రభాస్ పెళ్లి వార్తలు ఎప్పటికప్పుడు పుకార్లుగానే మిగిలి పోతున్న నేపథ్యంలో జనాలు ప్రభాస్ పెళ్లి వార్తలను పట్టించుకోవడం మానేశారు.

ఈ సమయంలోనే ప్రభాస్ పెళ్లి గురించి ఆయన పెదనాన్న అధికారికంగా స్పందించాడు.ఈసారి నమ్మకంగా పెళ్లి ప్రకటన చేశాడు.
తాజాగా తన పుట్టిన రోజు సందర్బంగా మీడియాతో మాట్లాడిన రెబల్ స్టార్ కృష్ణం రాజు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేయడంతో పాటు, తన వంతు కృషితో ప్రచారం చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
ఇక అదే సమయంలో మీడియా వారు ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించిన సమయంలో ‘సాహో’ చిత్రం పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు.ఇప్పటికే ఆ విషయమై మాకు హామీ ఇచ్చాడు.

సాహో చిత్రం షూటింగ్ వచ్చే ఏప్రిల్ మే వరకు పూర్తి కాబోతుంది.అంటే ఆ వెంటనే పెళ్లి పనులు మొదలు అయ్యే అవకాశం ఉంది.
‘సాహో’ చిత్రం దసరా కానుకగా విడుదల అయ్యే అవకాశం ఉంది.సినిమా విడుదలైన తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుంది.
ప్రభాస్ కోసం కుటుంబ సభ్యులు ఇప్పటికే అమ్మాయిని ఎంపిక చేసి పెట్టారనే టాక్ వినిపిస్తుంది.గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి అంటూ ప్రచారం జరుగుతోంది.
భారీ ఎత్తున అంచనాలున్న సాహో చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సాహో తర్వాత పెళ్లి అన్నాడు కనుక ఇక సాహో ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుంది, ప్రభాస్ పెళ్లి అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు.సాహో తో పాటు ‘జాను’ చిత్రంను రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ లోనే ప్రభాస్ చేస్తున్న విషయం తెల్సిందే.జాను వచ్చే ఏడాది సంక్రాంతికి దుమ్ము రేపబోతుందట.