రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేయాలని ప్రధాని మోడీ ఒక పథకాన్ని ప్రకటించారు.దేశ ప్రజలలో 50శాతం రైతులున్నారు.
ఆదాయం రెట్టింపు చేయాలంటే ఉత్పాదక పెంచడం – గిట్టుబాటు ధర – మంచి ఉపకరణాలు – ఇరిగేషన్ సౌకర్యం – విత్తన బదలాయింపు – తగినంత ఎరువు వాడకం-నూతన టెక్నాలజీ వినియోగం చేపట్టాలి.హార్టీకల్చర్-డైరీ, ఫౌల్ట్రీ, పందులు – చేపలు, చిన్న జంతువులు-అడవులు పెంచడం ద్వారా ఆదాయం సంపాదించాలి.
మార్కెట్‌లో మద్యదళారీలను తొలగించాలి.ఇవీ ప్రధాని సూక్తులు.
కానీ రైతుకు రోజు కూలి ఎంత ఇస్తున్నారు ?
ఒక ఎకరానికి(మాగాణి) అయ్యె ఖర్చులు సుమారుగా:
1.నారుమడి,మరియు పొలం దున్నడం 5500=00
2.చదును చేయడం, (గొర్రు)వేయడం 1500=00
3.గట్టు చెక్కడం పెట్టడం 1000=00
4.
వరి నాటు 4500=00
5.వరి విత్తనాలు హైబ్రిడ్ 8 కిలోలు 2500=00
6.
కలుపు మందు(300)+ కలుపు తీయడం(2700) 3000=00
7.DAP 2 బస్తాలు 2500=00
జింక్ 10 కిలోలు 400=00
8.
గుళికలు 800=00
9.యూరియా 2 బస్తాలు(700)+MOP పొటాష్ 1 బస్తా(800) 1500=00
10.
మందుల పిచికారీ 1000=00
11.వరి కోత మిషన్ 2500=00
13.
మిషన్ కు ట్రాక్టర్ 500=00
14.ధాన్యం ఆరబెట్టడం 500=00
15.మార్కెట్ కు ధాన్యం చేరవేతకు 1500=00
రైతు పెట్టుబడి మొత్తం 28,400=00
ధాన్యం దిగుబడి బస్తాలు = 40
1బస్తా కిలోలు = 60 మొత్తం క్వింటళ్లు(24×60)= 24 క్వింటాళ్లు
ధాన్యం క్వింటాలుకు ధర 1400×24= 33,600=00
(-)రైతు పెట్టుబడి 28,400=00
రైతుకు మిగిలింది 5200=00
(-)కరెంట్ మోటార్ రిపేర్ బిల్లు 2000=00
రైతు 6 నెలల కష్టార్జితం 3200=00
అంటే రైతుకు పడ్డ రోజు కూలి Rs 17=00
రెట్టింపు ఆదాయం అంటే ఇదేనా ……??