మీ ముఖ సౌందర్యం రెట్టింపు అవ్వాలంటే.... ఉల్లిపాయ ప్యాక్స్

ప్రతి ఒక్కరు ముఖం అందంగా, కాంతివంతంగా ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు.అయితే దీని కోసం ఎటువంటి కాస్మెటిక్స్ వాడవలసిన అవసరం లేదు.

 Onion Beauty Benefits And Onion Face Packs Details, Onion, Onion Beauty, Skin Ca-TeluguStop.com

మన వంటింటిలో ఉండే ఉల్లిపాయను ఉపయోగించి ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.మీకు చాలా ఆశ్చర్యంగా ఉందా? నిజమే.ఉల్లిపాయతో ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు.ఎలా అనేది వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఉల్లిరసంలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో కాటన్ సాయంతో రాయాలి.పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ప్రతి రోజు ఇలా చేస్తూ ఉంటే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.

ఉల్లిపాయ ముడతలను చాలా సమర్ధవంతంగా తగ్గిస్తుంది.

ఉల్లిపాయను ముక్కలుగా కోసుకొని మిక్సీలో పేస్ట్ కింద తయారుచేసుకోవాలి.ఈ పేస్ట్ ని ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముడతలు తగ్గిపోతాయి.

Telugu Face Pack, Skin, Lavender Oil, Olive Oil, Oil, Skin Care Tips-Telugu Heal

ఉల్లిపాయ రసంలో పెరుగు, కొన్ని చుక్కల లావెండర్ నూనెను వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే నల్లని మచ్చలు తొలగిపోతాయి.

ఉల్లిరసం, శనగపిండి, పచ్చిపాలను బాగా కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి.ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి.15 నిమిషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube