ఈ సారి కొత్త సంవత్సరంలో జనవరి 1 సోమవారం వచ్చింది.ఒక్కరు ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరంలోకి ఎన్నో ఆశలు, కోరికలతో అడుగు పెడతారు.
ఇప్పటివరకు ఉన్న కష్టాలు తొలగిపోయి భవిష్యత్ పై ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతారు.కొత్త సంవత్సరంలో ఆనందమగా ఉండాలని కోరుకుంటారు.
కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే బంగారు భవిష్యత్ ఉండాలని, మనస్సులో కోరికలు నెరవేరాలని ఆ రోజు నుంచే పూజలు చేయటం ప్రారంభిస్తారు.
జనవరి 1 వ తారీఖున ప్రతి ఒక్కరు గుడికి వెళుతూ ఉంటారు.అయితే హిందూ సంప్రదాయాన్ని ఫాలో అయ్యేవారు కొత్త సంవత్సరంలో కోరికలు నెరవేరాలన్నా, డబ్బు లోటు లేకుండా ఉండాలన్నా జనవరి 1 న శివునికి తెల్ల నువ్వులతో అభిషేకం చేయాలి.ఈ విధంగా చేయటం వలన మనస్సులో కోరికలు తీరటమే కాకుండా మానసికంగా కూడా బాగుంటుంది.
అలాగే రుద్రాక్ష మాలను ఉపయోగించి మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.అప్పుడు శివుడు ప్రసన్నం అవుతారు.
అంతేకాక పాయసం తయారుచేసి పేదవాళ్లకు పంచిపెట్టాలి.
సంవత్సరంలో వీలు ఉన్నప్పుడల్లా ఎక్కువ సార్లు తెల్లని అవుకు రొట్టె పెడుతూ ఉంటే శుక్ర గ్రహం బలపడి శుక్ర మహా దశ ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు కలుగుతాయి.
కొత్త సంవత్సరం మొదటి రోజు గుడిలో పది మందికి అన్నదానం చేయాలి.ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు సంవత్సరం మొదటి రోజే దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవాలి.ఇప్పుడు చెప్పిన పనులు చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా కోరుకున్న విధంగా డబ్బు కూడా వస్తుంది.