అక్కినేని నట వారసుడు అఖిల్ రెండో సినిమా ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.తన సినిమాల ఎంపికను తన నిర్ణయం మీదే వేసుకున్న అఖిల్ ఏ జానర్లో సినిమా తీయాలి ఎలాంటి సినిమా తీయాలి అన్న కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు.
అయితే ఈలోపు నాగార్జున ఓ అదిరిపోయే ప్లాన్ వేశాడట.అఖిల్ రెండో సినిమా ఓ మల్టీస్టారర్ తీస్తే సినిమాకు క్రేజ్ వచ్చే అవకాశం ఉందని ఆ విధంగా కార్యచరణలు చేస్తున్నాడు.
ఇక తనతో ఊపిరితో స్క్రీన్ షేర్ చేసుకున్న కార్తినే అఖిల్ తో మల్టీస్టారర్ కు ఒప్పిస్తున్నాడట నాగార్జున.
మరి ఇది ఎంతవరకో నిజమో తెలియదు కాని ఈ సినిమాతో అఖిల్ కు కోలీవుడ్లో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు కింగ్ నాగార్జున.
ఐడియా బాగానే ఉన్నా కార్తి దీనికి ఒప్పుకుంటాడా అన్నదే అసలు పాయింట్.ఇక ఇద్దరిని పెట్టి తీయాలంటే ఇప్పటికిప్పుడు డైరక్టర్ కూడా దొరకడం కష్టమే.ఏది ఎలా ఉన్నా నాగ్ ప్లాన్ వర్క్ అవుట్ అయితే అఖిల్ రెండో సినిమా భారీ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది.మరి నాగ్ వేసిన ఈ ప్లాన్ అయినా వర్క్ అవుట్ అవుతుందా లేక మళ్లీ వెనక్కి వెళ్తుందా అన్నది కొద్దిరోజుల్లో తెలుస్తుంది.