ప్రస్తుతం చిన్న వయస్సులోనే చాలామంది శారీరక శ్రమతో కూడిన పనులు చేయలేకపోతున్నారు.మంచి పోషకాలు అందించే ఆహారం తీసుకోకపోవడం, పిజ్జా, బర్గర్, ఫ్రైడ్‌రైస్ లాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్యాల బారిన పాడుతున్నారు.
దీని వల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది.దీని వల్ల కొంచెం దూరం నడిచినా అలసట అనిపించడం జరుగుతూ ఉంటుంది.
అయితే కొంతమంది మంచి డైట్ ఫాలో అవుతూ ఉంటారు.శరీరానికి శక్తిని అందించే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.
దీని వల్ల వాళ్లు ఆరోగ్యంగా, చాలా బలవతంగా ఉంటారు.
తాజాగా 65 ఏళ్ల ఒక తాత అంత పెద్ద వయస్సులో కూడా అద్భుతాలు సృష్టిస్తున్నాడు.అత్యంత బలం ఉన్నవారు మాత్రమే చేయగల పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.ఇంతకు ఆయన ఏం చేస్తున్నాడంటే.100 కిలోల బరువు ఉన్న బస్తాలను సింగిల్ చేతితో పైకి ఎత్తుతున్నాడు.అంతేకాదు 56 కిలోల సిలిండర్లను( 56Kg Cylinder ) గడ్డంతో లేపుతున్నాడు.
ఈ తాత సాధువుగా ఉన్నాడు.ఆయన చేస్తున్న సాహసాలు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి.
65 ఏళ్ల వయస్సులో( 65 Years Old Man ) కూడా ఈ సాధువుకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం కావడం లేదు.
మహారాష్ట్రలోని( Maharashtra ) భరత్‌పూర్‌కి చెందిన జానకీదాస్ మహరాజ్( Janakidas Maharaj ) అనే సాధువు మధురైలోని బైపాస్ రోడ్డులో నివసిస్తున్నాడు.సాహసాలు చేయడమంటే ఆయనకు ఇష్టం.దీంతో గతంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన వెయింట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని గెలుపొందాడు.
ఇందుకు గాను ఒక బైక్‌ను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు.ఇటీవల తనకు ఉన్న ఆరడుగుల గడ్డంతో రెండు నిండు సిలిండ్లను పైకి ఎత్తి భక్తులను ఆశ్చర్యపరిచాడు.
అంతేకాకుండా కుంభమేళా సమయంలో సాధువుల మధ్య జరిగిన పోటీలలో కూడా పాల్గొని గడ్డంతో బరువు ఎత్తడంతో రికార్డులు సృష్టించాడు.