టాలీవుడ్ హీరో మంచు మనోజ్( Manchu Manoj ) ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల కుమార్తె భూమా మౌనిక( Bhuma Mounika ) పెళ్లి చేసుకున్నారు మంచు మనోజ్.
వీరిద్దరికీ పరిచయం ఉండడంతో పాటు పలుసార్లు కలిసి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారని త్వరలో ఒక్కటి కాబోతున్నారు అంటూ రకరకాల వార్తలు వినిపించినప్పటికీ ఆ వార్తలపై మనోజ్ కానీ భూమ మౌనిక రెడ్డి కానీ స్పందించలేదు.పెళ్లికి ముందు సుమారు పదేళ్లకు పైగా పరిచయం, తర్వాత నాలుగేళ్ల ప్రేమ మొత్తానికి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లిపీటలెక్కారు.
అలా ఎట్టకేలకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఒకటయ్యారు ఈ జంట.మనోజ్ కి మాత్రమే కాకుండా భూమా మౌనికకు కూడా ఇదే రెండో వివాహమే.కాగా మంచు మనోజ్- మౌనికల వివాహ( Manoj-Bhumika Marriage ) ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంది మంచు లక్ష్మి.హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలోనే మనోజ్- మౌనికల వివాహం గ్రాండ్‌గా జరిగింది.
పెళ్లి పందిరి నుంచి వంటల విషయం వరకు ప్రతి ఒక్కటి కూడా మంచు లక్ష్మి దగ్గర ఉండి చూసుకుంది.ఇది మనోజ్ పెళ్లికి ముందు మంచు ఫ్యామిలీపై అనేక రకాల వార్తలు వినిపించాయి.
మనోజ్ మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? ఆయన వివాహానికి హాజరవుతారా? అన్న టెన్షన్ చాలామందిలో ఉంది.
అనేక రకాల రూమర్స్ కూడా వినిపించాయి.అయితే అందరికంటే మనోజ్ పెళ్లి గురించి తానే ఎక్కువగా టెన్షన్ పడ్డానంటోంది మంచు లక్ష్మి.( Manchu Lakshmi ) ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో విషయాల గురించి పంచుకుంది.
ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ.నాకు ఏ హెల్ప్ చేసేందుకైనా మనోజ్ ముందుంటాడు.ఒకసారి యాదాద్రికి వెళ్లినప్పుడు మనోజ్- మౌనికల పెళ్లి చేయి దేవుడా ఇందుకు మా నాన్నను ఒప్పించు అని వేడుకున్నాను.ఇక్కడ ఒక సమస్య ఉంది.
రెండు ఫ్యామిలీలకు ఒక చరిత్ర ఉంది.దీంతో వీరు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? సందేహాలు తలెత్తాయి.అయితే జీవితంలో ప్రేమ ఒక్కటే నిజం.వాళ్లిద్దరూ ప్రేమించుకుంటే మనకేంటి సమస్య.కుదిరితే ఆ ప్రేమికులను మనం ఆశీర్వదించాలి.అడ్డుపడకూడదు.
అందుకే ఆనందంతో వాళ్లను యాదాద్రి స్వామి( Yadadri Swamy )కి వెళ్లి దర్శనం చేయించాను.దేవుడు నా మాట విన్నాడు అనిపించింది.
ఇకపోతే నాకు పిల్లలంటే చాలా ఇష్టం.ముగ్గురిని, నలుగురిని కనాలనుకున్నాను.
కానీ దేవుడు ఒక్కరినే ఇచ్చాడు.రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.