22 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున ఇండో కెనడియన్ జస్వీందర్ కౌర్ జస్సీ.తన భర్త సుఖ్వీందర్ సింగ్ మిథూని హగ్ చేసుకుని రోడ్డుపై బైక్‌పై వెళ్తోంది.
ఈ క్రమంలో భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటూ వాటిని భర్తకు చెబుతోంది.కానీ కొన్ని నిమిషాల్లోనే జెస్సీ కలలు కల్లలయ్యాయి.
కాంట్రాక్ట్ కిల్లర్స్ ముఠా ఒకటి నారికే గ్రామ సమీపంలో ఈ జంటపై దాడి చేసింది.తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని జస్సీపై కక్ష కట్టిన ఆమె తల్లి, మేనమామలు సుపారీ గ్యాంగ్‌తో బేరం కుదుర్చుకున్నారు.
జెస్సీ కుటుంబానికి కెనడాతో పాటు కౌంకే ఖోసాలో భారీగా ఆస్తులు వున్నాయి.కానీ మిథూ ఒక నిరుపేద రైతు.
రెండు రోజుల తర్వాత ఛిద్రమైన స్థితిలో జెస్సీ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.మిథూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.ఈ పరువు హత్య అప్పట్లో పెను దుమారం రేపగా.దాదాపు 22 ఏళ్లుగా మిథూ న్యాయం కోసం పోరాడుతున్నారు.
సుదీర్ఘ నిరీక్షణ, న్యాయ పోరాటం తర్వాత జనవరి 2019లో జస్సీ తల్లి మల్కిత్ కౌర్, మేనమామ సుర్జిత్ బడేషాలు భారత్‌కు రప్పించబడ్డారు.ఇంత చేసినప్పటికీ ఇద్దరూ ప్రస్తుతం బెయిల్‌పై బయటే వున్నారు.
అనూహ్యంగా డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ మిథూ మాత్రం ఇంకా జైల్లోనే వున్నారు.అంతేకాదు మిథూపై నమోదైన అత్యాచారం సహా ఆరు కేసులు న్యాయస్థానంలో వీగిపోయాయి.ఈ కేసులపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల కమీషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ మెహతాబ్ సింగ్ గిల్ (రిటైర్డ్) మాత్రం మిథూని వీటిల్లో ఇరికించారనే వాదనను సమర్ధించారు.
22 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనపై మిథూ తల్లి సుఖ్‌దేవ్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ.జస్సీ, మిథూలు నారికేలో వున్న తన సోదరుడి ఇంట్లో రహస్యంగా నివసిస్తున్నారని చెప్పారు.ఈ క్రమంలో మలేర్‌కోట్ల నుంచి తిరిగి వస్తుండా మార్గమధ్యంలో దాడి జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసులో కోర్టు తుది తీర్పును ఈ జీవితంలో వింటానా అంటూ సుఖ్‌దేవ్ కౌర్ ఆశ్చర్యపోతున్నారు.ఈ కేసులో 12 మంది కాంట్రాక్ట్ కిల్లర్లు వున్నారని.వీరిలో ఏడుగురికి సంగ్రూర్ కోర్టు శిక్ష విధించిందని ఆమె చెప్పారు.తర్వాత ముగ్గురు మినహా మిగిలిన వారిని సుప్రీంకోర్ట్ నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తున్న మిథూతో పాటు తనకు బెదిరింపులు వచ్చాయని సుఖ్‌దేవ్ కౌర్ అన్నారు.
మార్చి 1999లో, జస్సీ తన కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా మిథూను రహస్యంగా వివాహం చేసుకుంది.జూన్ 2000లో, సంగ్రూర్‌లోని నారికే గ్రామ సమీపంలో కాంట్రాక్ట్ కిల్లర్లు ఈ దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో జస్సీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.