థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న 1134 ట్రైలర్

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది 1134 మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి.

 1134 Movie Trailer Launched With Thrilling Scenes Details, 1134 Movie Trailer ,l-TeluguStop.com

రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుందట.ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.

2 నిమిషాల 24 సెకనుల నిడివితో ఆద్యంతం ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు.ATM దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్య భరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు.

ట్రైలర్ చివరలో ‘అన్నీ నువ్వను కునేలా జరిగితే మరి నేనెందుకురా ఇక్కడ’ అంటూ వచ్చిన డైలాగ్.ఈ సినిమాలో ఏదో కొత్త కోణం చూపించబోతున్నారని స్పష్టం చేస్తోంది.

సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి.ప్రతి సన్నివేశం కూడా ఎంతో థ్రిల్ చేసేలా షూట్ చేశారు.

మరి కొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు.

రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రంలో గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి సంగీతం అందిస్తున్నారు.నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

నటీనటులు:

గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మడుపు.

సాంకేతిక వర్గం:

డైరెక్టర్: శరత్ చంద్ర తడిమేటి బ్యానర్: రాంధుని క్రియేషన్స్ మ్యూజిక్: శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి డీఓపీ: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి డీఐ: గజ్జల రక్షిత్ కుమార్ పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube