లీడ్‌ యొక్క సూపర్‌ 100 స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు శ్రీకాకుళం నుంచి ఎంపికైన ఇద్దరు గ్రేడ్‌ 10 విద్యార్థులు

శ్రీకాకుళంకు చెందిన ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు దేశవ్యాప్తంగా స్కూల్‌ ఎడ్‌టెక్‌ సంస్థ లీడ్‌ యొక్క ‘సూపర్‌ 100’ కోసం ఎంపికైన 100 మంది విద్యార్థుల సరసన నిలిచారు.భారతదేశ వ్యాప్తంగా లీడ్‌ శక్తివంతమైన సీబీఎస్‌ఈ పాఠశాలల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన టాప్‌ 100 విద్యార్థుల కోసం (విద్యాసంవత్సరం 2022–23) ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కోచింగ్‌, ట్యూటరింగ్‌, మెంటారింగ్‌ కార్యక్రమం సూపర్‌ 100.

 Grade 10 Students Selected From Srikakulam Selected For Lead's Super 100 Program-TeluguStop.com

శ్రీకాకుళంలోని ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు పార్థు నాయుడు మరియు ఎం మృద్వీకాలు ఒక సంవత్సరం పాటు జరిగే కార్యక్రమం కోసం భారతదేశంలో అతి పెద్ద ఎడ్‌ టెక్‌ కంపెనీ లీడ్‌ నుంచి పూర్తి స్ధాయిలో స్కాలర్‌షిప్‌ పొందారు.లీడ్‌ యొక్క సూపర్‌ 100 ప్రోగ్రామ్‌ కోసం భారతదేశ వ్యాప్తంగా 9000 మందికి పైగా విద్యార్థులు ప్రవేశ పరీక్షలలో పాల్గొన్నారు.

ఇది వ్యక్తిగతీకరించిన విద్యా మార్గనిర్దేశనం, ట్యూటరింగ్‌ మరియు ప్రాక్టీస్‌ను టియర్‌ 2 పట్టణాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు అందిస్తుంది.

లీడ్‌ యొక్క సూపర్‌ 100 ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా భారతదేశంలో చిన్న పట్టణాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశాల పరంగా అసమానతలను తొలగించడమే లక్ష్యంగా ప్రారంభించారు.

విద్య పరంగా వారు మెరుగైన ప్రతిభను వెల్లడించేందుకు తగిన అవకాశాలను దీని ద్వారా అందించనున్నారు.లీడ్‌ ఇప్పుడు భారతదేశంలో మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లీష్‌, సోషల్‌ స్టడీస్‌ మరియు హిందీలలో అత్యుత్తమ ఉపాధ్యాయులను తీసుకురావడంతో పాటుగా వారి చేత కోచింగ్‌, ట్యూటరింగ్‌ మరియు మెంటారింగ్‌ను ఈ సూపర్‌ 100 విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేసింది.

ఈ ప్రోగ్రామ్‌ భారతదేశంలో ద్వితీయ శ్రేణి నగరాలకు చెందిన విద్యార్ధులకు సహాయపడటంతో పాటుగా మెట్రో నగరాలకు చెందిన తమ సహచర విద్యార్థుల సరసన సగర్వంగా నిలిచేందుకు తోడ్పడుతుంది.దానితో పాటుగా సమయపాలన, తోటి విద్యార్థుల నుంచి మరింతగా నేర్చుకునే అవకాశమూ లభిస్తుంది.

లీడ్‌ కో ఫౌండర్‌ అండ్‌ సీఈవొ సుమీత్‌ మెహతా మాట్లాడుతూ ‘‘ తమ విద్యా లక్ష్యాలను చేరుకోవడంలో కష్టపడటంతో పాటుగా విజయం సాధించిన శ్రీకాకుళం కు చెందిన సూపర్‌ 100 స్కాలర్‌షిప్‌ గ్రహీతలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను.ప్రతి చిన్నారిలోనూ ప్రతిభ ఉంటుంది.

కానీ భారతదేశంలోని చిన్న పట్టణాలకు చెందిన విద్యార్థులు తగిన వనరులు, మద్దతు లేక వెనుకబడి ఉంటారు.సూపర్‌ 100తో లీడ్‌ ఇప్పుడు ఈ విద్యార్థులు తగిన అవకాశాలు పొందగలరనే భరోసా అందిస్తుంది.

తద్వారా వారు నేషనల్‌ బోర్డ్‌ టాపర్స్‌గా తమ సరైన స్థానం సంపాదించగలరు’’ అని అన్నారు.

ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన పార్థునాయుడు మాట్లాడుతూ ‘‘క్లాస్‌ 10 బోర్డ్‌ పరీక్షలలో టాపర్‌గా నిలువాలన్నది నా కల.లీడ్‌ యొక్క సూపర్‌ 100 ప్రోగ్రామ్‌తో, ఇప్పుడు నేను ఆ కలను సాకారం చేసుకోవడంలో మరో అడుగు ముందుకు వేశాను.లీడ్‌ తో పాటుగా నాకు ఈ అవకాశం అందించిన మా పాఠశాలకు సైతం ధన్యవాదములు తెలుపుతున్నాను.

భారతదేశంలో అత్యుత్తమ ట్యూటర్ల నుంచి అభ్యసించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.లీడ్‌ సూపర్‌ 100 ఫైనలిస్ట్‌గా నేను గర్వంగా ఉన్నాను.

ఈ కార్యక్రమాన్ని అత్యుత్తమంగా వినియోగించుకోగలననే ధీమాతో ఉన్నాను’’ అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube