నల్గొండ జిల్లా:నాగార్జున సాగర్ బీజేపీ ఇంచార్జితో పాటు,అఖిల భారత బంజారా శక్తి పీఠ్ ధర్మగురువు సంత్ బాబుసింగ్ మహరాజ్ మరియు,గుగులోతు వెంకన్న నాయక్,బీజేపీ రాష్ట్ర నాయకులు రాహుల నాయక్ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ను కలిసి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు భారత్ దేశంలో 12 కోట్లమంది బంజారా సమాజ్ మాట్లాడేటటువంటి భాష “గోరబోలి”ని భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని,గత 30 సంవత్సరాల నుండి భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఆనాటి పాలకులు పట్టించుకోలేదని రాష్ట్రపతి వద్ద వాపోయారు.
ఇట్టి విషయాన్ని పరిశీలించి,రాజ్యాంగంలో చేర్చే విధంగా చొరవ చూపాలని కోరారు.అదే విధంగా భారత దేశంలో గిరిజనులకు 7.5 శాతం రిజర్వేషన్ అమలులో ఉన్న 3 శాతం కూడా ఆచరణలో అమలు అవ్వటంలేదని, మరియు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇచ్చిన 12 శాతం గిరిజన రిజర్వేషన్ అమలు అయ్యేవిధంగా చూడాలని,తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు పోడు భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, దేశంలో అటవీ 2005 చట్టం,PESA చట్టం,1/70 చట్టం అమలులో ఉన్నా తెలంగాణలో మాత్రం అమలు అవ్వటం లేదన్నారు.12 కోట్ల బంజారాల కోసం దేశ రాజధానిలో 2 ఎకరాల స్థలం బంజారా భవన్ కొరకు కేటాయించాలని కోరారు.అన్ని విషయాలను పరిశీలించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చారని తెలిపారు.