నేటి ఆధునిక కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య కంటి చూపు క్షీణత.వయసు పైబడే కొద్ది కంటి చూపు తగ్గడం సర్వ సాధారణం.
కానీ, ఈ మధ్య చిన్న వయసు వారిలో సైతం ఈ సమస్య కనిపిస్తోంది.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, పోషకాల లోపం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లతోనే ఎక్కువ సమయం పాటు గడపటం, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల తక్కువ వయసులోనే కంటి చూపు క్షీణత సమస్యను ఎదుర్కొంటున్నారు.
అయితే ఇలాంటి వారు డైట్‌లో కొన్ని కొన్ని ఫుడ్స్ చేర్చుకుంటే కంటి చూపు పెంచుకోవచ్చు.మరి ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.
క్యాప్సికమ్ కంటి చూపును మెరుగు పరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, లూటిన్ మరియు బీటా-కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి కంటి చూపును పెంచడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.కాబట్టి, వారంలో కనీసం రెండు, మూడు సార్లు అయినా క్యాప్సికమ్ తీసుకోండి.
అలాగే కమలా, బత్తాయి, నిమ్మ ఇటువంటి సిట్రస్ పండ్లు కూడా కంటి చూపును పెంచగలవు.సిట్రస్ పండ్లలో అత్యధికంగా ఉండే విటమిన్ సి కంటి కండరాలను బలంగా మార్చి చూపు పెరిగేలా చేస్తుంది.
రెడ్ వైన్ అవును మీరు విన్నది నిజమే కంటి చూపును మెరుగు పరచడంలో ఇది కూడా అద్భుతంగా సహాయపడుతుంది. రెడ్ వైన్‌ను తగిన మోతాదులో తీసుకుంటే అందులో అధికశాతంలో ఉండే ఫ్లెవనాయిడ్స్ కార్నియాను ఆరోగ్యంగా మారుస్తాయి.దాంతో కంటి చూపు పెరుగుతుంది.
కొన్ని కొన్ని ఆకు కూరలు కూడా కంటి చూపును పెంచుతాయి.ముఖ్యంగా బచ్చలి కూర, మెంతి కూర, పాల కూర వంటి ఆకుకూరలను తరచూ తీసుకుంటూ ఉండాలి.ఇక నట్స్, బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, అవకాడో, ద్రాక్ష, చిక్కుళ్లు, ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాల ద్వారా కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు.