నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని గుర్రంపోడు మండలం మోసంగి,కొత్తలాపురం గ్రామంలో మహాశివరాత్రి పండగ సందర్భంగా శ్రీ భక్త మార్కండేయ స్వామి జాతర మహోత్సవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి ముఖ్యాతిథిగా హాజరైనారు.
దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రెండు గ్రామాల సర్పంచులు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా గ్రామ స్థాయి కబడ్డీ పోటీలలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు.ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న జాతర్లు ప్రాంతీయ సాంప్రదాయాలకు గుర్తులుగా మిగులుతాయని తెలిపారు.
భక్త మార్కండేయ స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజానీకమంతా పాడిపంటలతో సమృద్ధి కలిగి, ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని,ప్రతి ఒక్కరూ దైవ చింతన,ఆధ్యాత్మికతతో కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గుర్రంపోడ్ జడ్పిటిసి,ముఖ్య సలహాదారుడు గాలి రవికుమార్ గౌడ్,టిఆర్ఎస్ నాయకులు కడారి అంజయ్య యాదవ్,రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నెం రంజిత్ యాదవ్,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి,మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ బల్గూరి నాగేష్,మాజీ మండల అధ్యక్షులు గుండెబోయిన కిరణ్, మొసంగి, కొత్తలాపురం సర్పంచులు రావులపాటి భాస్కర్,ఎనమల్ల కృష్ణ ప్రసాద్,చేపూర్ సర్పంచ్ విజయ్,కొప్పోలు సర్పంచ్ లింగారెడ్డి,వెంకటాపురం సర్పంచ్ శ్రీను,ఘసి రామ్ తండా సర్పంచ్ ధశ్రు నాయక్,పిట్టలగుడెం సర్పంచ్ పోలే రామచంద్రు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాబురావు నాయక్,నడ్డి సైదులు,మర్రి భిక్షం,లింగయ్య యాదవ్,నరసింహారావు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.