లండన్‎లో వైఎస్ఆర్‎సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలోనే కాకుండా వైసీపీ విదేశాల్లో సైతం మంచి పేరును గడించిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

 Ysrcp Social Media Spiritual Conference In London , Sajjala Bhargava Reddy , Ys-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా లండన్ లో వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది.యూకే వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి( Dr.Pradeep Reddy Chinta ), వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశం దిగ్విజయంగా సాగింది.

Telugu Drpradeep, London, Sajjalabhargava, Cm Jagan, Ycp Ap, Ysr Congress, Ysrcp

ఈ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మీడియా మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి( Sajjala Bhargava Reddy ), ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు మేడపాటి వెంకట్, ఏపీ ఎస్ఎస్డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు.వారితో పాటు యూకే నలుమూలల నుంచి సుమారు 450 మందికి పైగా వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు./br>

Telugu Drpradeep, London, Sajjalabhargava, Cm Jagan, Ycp Ap, Ysr Congress, Ysrcp

ఏపీ రాష్ట్ర ప్రజల కోసం ప్రతి క్షణం సీఎం జగన్ కష్టపడుతున్నారని సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి అన్నారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అవినీతిపరుల గుండెల్లో సింహా స్వప్నంగా నిలుస్తుందని తెలిపారు.ఈ క్రమంలో దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు అందరం అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏపీలో గ్రామాలను సీఎం జగన్( CM ys jagan ) ఎంత అభివృద్ధి చేశారో స్వయంగా వచ్చి చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయమని పేర్కొన్నారు.అదేవిధంగా రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా పని చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175/175 టార్గెట్ గా అందరం కలిసి చేద్దామని పిలుపునిచ్చారు.ఎవరికీ ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube