ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC Chief)గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్ర పర్యటనకు సిద్ధం అయ్యారు.ఈ మేరకు జిల్లాల వారీగా షర్మిల పర్యటన కొనసాగనుంది.
ఈనెల 23వ తేదీన ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన (Sharmila Tour) ప్రారంభంకానుంది.ఈ పర్యటన సుమారు తొమ్మిది రోజుల పాటు ఇడుపులపాయ (Idupulapaya) వరకు కొనసాగనుంది.
ఇందులో భాగంగానే ప్రతి రోజూ రెండు జిల్లాల సమన్వయ కర్తలతో షర్మిల భేటీ కానున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) బలోపేతంతో పాటు అభ్యర్థుల ఎంపిక (Candidates Selection) మరియు ఆశావహుల నుంచి దరఖాస్తులను కూడా ఆమె స్వీకరించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ (Route Map) ను పీసీసీ సిద్ధం చేసింది.