నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో షర్మిల నిర్వహించిన సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని గురించి షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో జరిగిన ఈ సభలో షర్మిల మాట్లాడుతూ అధికార పార్టీ టిఆర్ఎస్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ సందర్భంగా తండ్రి వైయస్సార్ చేసిన పాదయాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
సరిగ్గా 18 సంవత్సరాల క్రితం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఏప్రిల్ 9 వ తారీకు వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం పాదయాత్ర స్టార్ట్ అయిందని పేర్కొన్నారు.
పాదయాత్ర గురించి అనేక విషయాలు తెలియజేస్తూ తండ్రి వైఎస్సార్ ని పొగడ్తలతో ముంచెత్తింది.
పాదయాత్రలో సంక్షేమ బీజానికి బీజం పడిందని తెలిపింది.వైఎస్ఆర్ అనేక కార్యక్రమాలు పాదయాత్రలో చూసిన కష్టాలను ద్వారా ముఖ్యమంత్రి అయ్యాక అమలు చేశారని షర్మిల స్పష్టం చేశారు.
అటువంటి మహా నాయకుడిని తిరిగి తెలంగాణ రాజకీయాలలో ప్రతిష్టించ బోతున్నామని.రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు షర్మిల ప్రకటన చేశారు.
వైయస్ జయంతి రోజు అనగా జూలై 8 వ తారీకు కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని, అదే రోజు జెండా మరియు అజెండా ప్రకటించడం జరుగుతుందని.ఖమ్మం వేదికగా పార్టీ ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో వేదిక దద్ధరిల్లింది.వైఎస్ఆర్ అభిమానులు మరియు శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.