జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్దయెత్తున రాజకీయ దుమారానికి దారితీశాయి.ప్రధానంగా పవన్ నోట బీజేపీ రోడ్డు మ్యాప్ పై వామపక్షాలు మండిపడుతున్నాయి.
పవన్ తాజా వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి రోడ్డు మ్యాప్ తోనే ప్రభుత్వం నడుస్తుందని, మళ్ళీ కేంద్రం రోడ్ మాపిస్తే ఒరిగేదేమిలేదన్నారు.ప్రజలకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ. బీజేపీ కోసం రోడ్ మ్యాప్ అమలు చేసేవారిని ప్రజలు దూరం పెడతారని పిలుపునిచ్చారు.అయితే బిజెపితో జట్టుకట్టే పవన్ కళ్యాణ్ ప్రసంగంలో విభజన హామీల ప్రస్తావన లేకపోవడం విడ్డూరమన్నారు.ఇప్పటికైనా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీయడం మాని రోడ్డుమాప్ కోసం పవన్ ఎదురు చూడడం ఏ0టన్నారు.