ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ అందుకు అవసరమైన అన్ని వనరులను సమీకరించుకుంటుంది .తమకు బలమున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకోవాలని ,పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది ఆ దిశగా ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో స్టార్ కాంపైనర్గా ప్రియాంక గాంధీని దింపిన కాంగ్రెస్ అధిష్టానం ఆదిశగా మంచి ఫలితాలను సాధించినట్లుగా వార్తలు వస్తున్నాయి, ప్రియాంక ( Priyanka Gandhi )రాకతో అక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని ఆ పాజిటివ్ ఎనర్జీ అసెంబ్లీ ఎన్నికల విజయం లో ప్రతిపలిస్తుంది అన్న భావనలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఆ మ్యాజిక్ ను తెలంగాణలో కూడా రిపీట్ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం .

తెలంగాణ లో కెసిఆర్ ప్రభుత్వం( CM KCR ) నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలమైనందున యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వారిని సంఘటితం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్నదట .

యూత్ డిక్లరేషన్ పేరుతో లక్షల మంది నిరుద్యోగులతో మే 8వ తారీఖున తెలంగాణలోని సరూర్నగర్ లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటుందని తెలుస్తుంది తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మాట్లాడుతూ నిధులు నియామకాలు అంటూ తెలంగాణ తెచ్చుకుని ఇప్పుడు ప్రశ్నాపత్రాలను మార్కెట్లో అంగడి సరుకులుగా మార్చేసిన ఈ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, యువత పెద్ద సంఖ్యలో ఈ సభకు విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు .తెలంగాణలో రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ తమ సమర్థత ను బట్టి ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు .యువతను ఆకట్టుకోవడం ద్వారా అధికారంలోకి రావాలని ప్రణాళికలు వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ యువత ఏ మేరకు మద్దతు ఇస్తారో వేచి చూడాలి
.