ఆర్మీ జవాన్ అనిల్ అంత్యక్రియలు మరికాసేపటిలో జరగనున్నాయి.కరీంనగర్ జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ కు జవాన్ అనిల్ భౌతిక కాయం చేరుకుంది.
గంగాధర చౌరస్తా నుంచి ర్యాలీగా అనిల్ భౌతికకాయాన్ని తరలించారు.ఈ ర్యాలీలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనిల్ పార్థివదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.కాగా అనిల్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగనున్నాయి.
దీంతో గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.అయితే, జమ్మూకాశ్మీర్ లోని తూర్పు కిషత్వార్ జిల్లా కొండల్లో ఆర్మీ హెచ్ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ తరువాత కూలిపోవడంతో అనిల్ మరణించిన సంగతి తెలిసిందే.