సోషల్ మీడియాలో( Social Media ) కొన్ని కొన్ని సార్లు వైరల్ అయిన వీడియోలు ఎన్నో విమర్శలకు లోనవుతాయి.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓ చిన్న ఫామిలీ కారులో( Car ) పయనం కావాలంటే చోటు సరిపోతుంది.అయితే ఇద్దరు, ముగ్గురు మనుషులు పెరిగినపుడు 5 సీటర్స్ మాత్రమే ఉన్నకారు కాస్త కష్టంగా అనిపిస్తుంది.
ఇలాంటి క్రమంలోనే మనుషులు తమ బుద్ధికి పని చెబుతారు.కానీ వారి నిర్వాకం చూసిన ఎదుటివారు వారిని బుద్ధిలేనివారిగా పరిగణిస్తారు.
అయితే మనదగ్గర ఆ బాధ లేదు.ఎందుకంటే ఇక్కడ సహజంగా నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం బయటకి వెళ్ళినపుడు బైక్నే ఎంచుకుంటారు.అయితే అది అన్నివేళలా మంచిది కాదనుకోండి.కాగా అలాంటి వారి కోసం ఇక్కడ రతన్టాటా అప్పట్లో నానో కారును లాంచ్ చేశారు.అందులో వారు సౌకర్యంగా ప్రయాణించేవారు.మరి పాకిస్థాన్కి చెందిన కార్ల తయారీ కంపెనీలు తమ దేశ పౌరుల కోసం ఇలాంటి ఆలోచన చేయట్లేదేమో.
గానీ ఈ వీడియో చూస్తే అలానే అనిపిస్తుంది.
ఇన్ స్టాగ్రామ్ లోని నెట్టింట వైరల్గా మారిన వీడియోని చూస్తే అలాగే అనిపిస్తుంది.ఓ కారులో ప్రయాణిస్తున్న కుటుంబం చిన్నారులను ( Children ) కారు వెనక వైపున డిక్కీ భాగంలో కూర్చోబెట్టారు.అయితే ఇక్కడ వారు పడిపోకుండా పంజరంలాంటి ఊచలు అమర్చారు.
దాంతో వారు అందులో బంధీలుగా కనబడుతున్నారు.అవును, ఏదో బోనులో ఉంచినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.పాకిస్థాన్లోని కరాచీ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.ఈ విషయంలో కరాచీ( Karachi ) చాలా పురోగతి సాధించిందని ఆ వీడియో తీస్తున్న వారు అన్నారు.
అలా ప్రయాణించడం ప్రమాదకరమని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.