సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి జరుగుతుందంటే వారి పెళ్లి గురించి పెద్ద ఎత్తున ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా జరిగిన కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి గురించి ఇప్పటికే ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా మరొక హీరో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకొని నూతన సంవత్సరం సందర్భంగా తన కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ సీరియల్స్ ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకొని అనంతరం ది సర్జికల్ స్ట్రైక్ సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహిత్ రైనా ఆ తర్వాత పలు సినిమాలలో నటించి విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.
ఇలా బుల్లితెర సీరియల్ వెండితెర సినిమాలలో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న ఈయన తన చిన్ననాటి స్నేహితురాలు అదితి అనే యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హీరో ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే తన వివాహాన్ని ఎంతో నిరాడంబరంగా జరుపుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీంతో ఈ ఫోటోలు చూసిన ఇతర నటీనటులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.