టీడీపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంబటి.. అక్రమార్కుల భరతం పడితే ఇంత రాద్దాంతమా.. ?

ఏపీలో భూవివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.టీడీపీ హయామంలో చేసిన భూ ఆక్రమణల పై వైసీపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్న విషయం తెలిసిందే.

 Ycp Leader Ambati Rambabu Fires On Tdp Leaders, , Ambati Rambabu, Fires, Tdp Lea-TeluguStop.com

ఈ క్రమంలో ఎవరెవరు భూ ఆక్రమణలో తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారో వారి చిట్టా విప్పి కేసులు పెడుతూ, ఆక్రమించబడిన భూములను స్వాధీనం చేసుకుంటుంది.

ఇలాగే కొన్నిరోజుల కిందట టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూముల అంశంపైనా వివాదం చెలరేగగా, ఇటీవల విశాఖలో ఓ మానసిక దివ్యాంగుల పాఠశాలను ప్రభుత్వం కూల్చివేసిందంటూ రచ్చ జరిగింది.

అయితే ఇది తమ ప్రభుత్వం పై చేస్తున్న తప్పుడు ఆరోపణలు అంటూ పేర్కొంటున్న అంబటి మానసిక దివ్యాంగుల పాఠశాలల పేరిట జరిగే దురాక్రమణలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.అయినా అక్రమార్కుల భరతం పడితే ఏదో సత్యహరిశ్చందుల్లా మాట్లాడుతున్న టీడీపీ నేతలు విశాఖలోని అతి ఖరీదైన భూములను చంద్రబాబు హయాంలో పప్పుబెల్లాల్లా లీజుకు ఇచ్చిన విషయాన్ని మరచినట్లుగా ఉన్నారు.

అందుకే ఇంత రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహించారు అంబటి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube