పవన్ వ్యాఖ్యలపై కోర్టుకు వెళుతున్న వైసీపీ ప్రభుత్వం..!!

రెండో దశ వారాహి యాత్రలో( Varahi Yatra ) భాగంగా ఏలూరులో వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.వాలంటీర్లు ( Volunteers )మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు చేశారు.

 Ycp Government Going To Court Over Pawan's Comments , Ysrcp, Pawan Kalyan, Volun-TeluguStop.com

పవన్ చేసిన కామెంట్లకు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాలంటీర్ల వ్యవస్థను అవమానించి మాట్లాడటం పట్ల అసహనం వ్యక్తం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే వాలంటీర్ల వ్యవస్థ పై పవన్ చేసిన ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడానికి డిసైడ్ అయ్యింది.

సెక్షన్ 199/(4)(b) పై కేసు వేసేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేయడం జరిగిందట.

అంతేకాకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను సూచించింది అంట.హైకోర్టు అనుమతి ద్వారా కేసు నమోదు చేయించే ప్రయత్నాలు వైసీపీ చేస్తూ ఉంది.ఇదిలా ఉంటే తాను అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి రావడం జరిగిందని తాజా పరిణామాలపై పవన్ వ్యాఖ్యానించారు.

మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పంచకర్ల రమేష్ ( Panchkarla Ramesh )జాయినింగ్ కార్యక్రమంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.తనపై కేసు పెట్టుకోవడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube