ప్రస్తుతం చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరు హీరోలకు జోడీగా శ్రీలీల( Srileela ) బెస్ట్ ఆప్షన్ అవుతున్నారు.శ్రీలీల నటిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
అయితే శ్రీలీల సైతం పెరుగుతున్న క్రేజ్ కు అనుగుణంగా రెమ్యునరేషన్ ను పెంచేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.నితిన్ వెంకీ కుడుముల కాంబో మూవీలో మొదట రష్మిక( Rashmika ) హీరోయిన్ గా ఎంపికయ్యారనే సంగతి తెలిసిందే.
అయితే రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీలీలను ఈ సినిమాకు ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.అయితే శ్రీలీల రెమ్యునరేషన్( Remuneration ) ప్రస్తుతం 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.
భారీ స్థాయిలో శ్రీలీల పారితోషికంను పెంచినా నిర్మాతలు ఆమె డిమాండ్ చేసిన స్థాయిలో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.శ్రీలీల క్రేజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీలీల ఈ ఏడాది పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.శ్రీలీల భగవంత్ కేసరి, గుంటూరు కారం( Bhagwant Kesari, Guntur karam ) సినిమాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.శ్రీలీల ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో క్రేజ్ ను కొనసాగిస్తారేమో చూడాలి.తన కష్టానికి అదృష్టం తోడు కావడం శ్రీలీలకు కలిసొస్తుందనే చెప్పాలి.
శ్రీలీలకు ఇతర భాషల నుంచి కూడా భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం 2 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న శ్రీలీల రాబోయే రోజుల్లో 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ శ్రీలీల నామస్మరణ చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.శ్రీలీల నంబర్ వన్ హీరోయిన్ గా నిలవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







