ఆసియా కప్ టోర్నమెంట్ లో( Asia Cup ) ఆసియా ఖండంలో ఉండే క్రికెట్ దేశాల జట్లు పాల్గొంటాయి.ఈ ఆసియా కప్ టోర్నమెంట్ 1984 నుంచి నిర్వహించబడుతూ.
ఇప్పటివరకు 15 ఆసియా కప్ టోర్నీలు పూర్తయ్యాయి.
అయితే ఆసియా కప్ టోర్నమెంట్ అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా భారత్( India ) నిలిచింది.
భారత్ ఇప్పటివరకు ఏకంగా 7 సార్లు ఆసియా కప్ టోర్నీ విజేతగా నిలిచింది.శ్రీలంక 6 సార్లు టైటిల్ గెలిచి అత్యధిక సార్లు గెలిచిన రెండవ జట్టుగా నిలిచింది.
ఇక దాయాది దేశం పాకిస్తాన్( Pakistan ) రెండుసార్లు ఆసియా కప్ టోర్నీ విజేతగా నిలిచింది.భారత జట్టు ఏ సంవత్సరంలో టోర్నీ గెలిచిందో తెలుసుకుందాం.
1984 ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ యూఏఈ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగింది.శ్రీలంకను చిత్తుగా ఓడించిన భారత్ అరంగేట్ర సీజన్ విజేతగా నిలిచి, టైటిల్ కైవసం చేసుకుంది.

1988 ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ బంగ్లాదేశ్ వేదికగా భారత్- శ్రీలంక మధ్య జరిగింది.మళ్లీ శ్రీలంకను( Sri Lanka ) చిత్తుగా ఓడించిన భారత్ విజేతగా నిలిచి, ఆసియా కప్ కైవసం చేసుకుంది.
1990-91 ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ భారత్ వేదికగా శ్రీలంక- భారత్ మధ్య జరిగింది.ఈ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్ గెలిచింది.
1995 ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ యూఏఈ వేదికగా భారత్- శ్రీలంక మధ్య జరిగింది.ఈ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్ గెలిచింది.

2010 ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ శ్రీలంక వేదికగా భారత్- శ్రీలంక మధ్య జరిగింది.ఈ మ్యాచ్ లో కూడా గెలిచి భారత్ టైటిల్ ఖాతాలో వేసుకుంది.
2016 ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ బంగ్లాదేశ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగింది.ఈ మ్యాచ్ లో గెలిచిన భారత్ టైటిల్ సొంతం చేసుకుంది.
2018 ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ యూఏఈ వేదికగా భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగింది.ఈ మ్యాచ్ గెలిచిన భారత్ టైటిల్ సొంతం చేసుకుంది.








