ఈ మధ్యకాలంలో చాలామంది పురుషులు చాలా తక్కువ స్పెర్మ్ కౌంట్ ను( Sperm Count ) కలిగి ఉంటున్నారు.దీనివలన పిల్లలు పుట్టకపోవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
దీనికి కారణం మారుతున్న జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, ఆందోళన, ధూమపానం, మద్యపానం లాంటివే అని మనందరికీ తెలిసిందే.అయితే ఇది చాలా మంది పురుషులలో బంధత్వానికి దారితీస్తుంది.
అలాగే వైవాహిక జీవితం అస్తవ్యస్తంగా కూడా మారుతుంది.ఈ సమస్యతో బాధపడుతున్న వారు రోజుకు రోజు పెరిగిపోతున్నారు.
అలాగే ఈ సమస్య కారణంగా ఎంతో మంది బాధపడుతున్నారు.అందుకే ఈ సమస్య నుండి బయటపడడానికి ఎన్నో రకాల మందులు, సప్లిమెంట్లను ఉపయోగిస్తున్నారు.

అయితే మందులకు బదులు సహజసిద్ధంగా లభించే ఎండు ద్రాక్ష( Raisins ) తీసుకోవడం వలన కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి.అలాగే వివిధ రంగులలో కూడా లభిస్తాయి.అంతేకాకుండా ఎండు ద్రాక్ష లైంగిక ఆరోగ్యానికి కాకుండా శరీరానికి కూడా చాలా ఆరోగ్యకరమైనవి.ఎండు ద్రాక్షలో ప్రోటీన్, ఐరన్, ఫైబర్, కాపర్, పొటాషియం, కాల్షియం లాంటివి ఎన్నో పోషకాలు ఉన్నాయి.వీటిని తీసుకోవడం వలన పురుషుల్లో ( Men ) స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.
అలాగే లైంగిక సామర్థ్యం కూడా మెరుగవుతుంది.

అలాగే లైంగిక సంబంధిత సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పురుషులు ఎండు ద్రాక్ష తీసుకోవడం వలన లైంగిక శక్తి పెరిగి శరీరం చాలా దృఢంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎండు ద్రాక్షను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లైంగిక సమస్యలతో బాధపడే పురుషులు రోజు 10 నుండి 12 ఎండు ద్రాక్షలను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి.ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వినియోగం పురుషులలో స్పెర్మ్ కణాల నాణ్యతను పెంచుతుంది.
అలాగే వారి సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.