అడవిలో ఒకే ఒక నియమం ఉంది, అదేంటంటే ఒక జీవి బతకాలంటే మరొక జీవి చావాల్సిందే.ఒక జంతువు ప్రాణం కోసం పరిగెడితే ఇంకొక జంతువు ప్రాణాలు తీసేందుకు పరిగెడుతుంది.
ఎరగా ఉండే జంతువు దొరక్కుండా పరిగెడితే అదే ఆహారంగా బతికే కౄర జంతువులు చచ్చిపోతాయి.సింహాలు, పులులు వంటివి వాటి సొంత వ్యూహాలను అమలు చేస్తూ జింకలు, ఎద్దులు, కంచర గాడిదలు, అడవి ఆవులను ఈజీగా పట్టుకుని చంపేస్తుంటాయి.
అడవి కుక్కలు, హైనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే శాఖాహార జంతువులకు చాలా జీవుల నుంచి హాని ఉంటుంది.అయితే మిగతా క్రూర జంతువుల ( wild animals ) కంటే తోడేళ్లు వేట కళలో అద్భుతమైన, సాటిలేని స్కిల్స్ కలిగి ఉంటాయి.
ఇవి గుంపులుగా వేటాడి అద్భుతమైన వ్యూహాలతో తమ ఆహారాన్ని పొందుతాయి.అయితే వీటి పప్పులు ఒక కుందేలు ముందు మాత్రం ఉడకలేదు.ఒక పెద్ద కుందేలును పొందడానికి విశాలమైన పొలంలో రెండు పెద్ద తోడేళ్ళు పట్టుకోవడానికి ఇటీవల ప్రయత్నించాయి.తోడేలు నోటికి చిక్కకుండా తప్పించుకోవడానికి కుందేలు చాలా వేగంతో పరిగెత్తింది.
తోడేళ్లలో ఒక్కటైనా కుందేలును తోక పట్టుకుని లాగితే కుందేలు( Rabbit ) ఆట అయిపోయినట్లే.కానీ అది జరగలేదు.
ఆ కుందేలు మిల్లి సెకండ్ల సమయంలోనే డైరెక్షన్ మారుస్తూ రెండు తోడేళ్లకు ( wolves )చుక్కలు చూపించింది.అది ఆ తోడేళ్లకు బాగా రొప్పు వచ్చి స్లో అయ్యేంతవరకు వాటిని ఊరికించింది.తర్వాత ఈ కుందేలు గాల్లో ఎగురుతూ ఉన్నట్లు చాలా వేగంతో వాటి నుంచి దూరంగా పారిపోయింది.దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.దీనికి “లైఫ్ అంటే ఎప్పుడూ ప్రయత్నాలను మానుకోకపోవడమే” అని ఒక ఇన్‌స్పిరేషనల్ క్యాప్షన్ జోడించారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ ఈ కుందేలు సూపర్ గా తప్పించుకుంది అని కామెంట్ చేస్తున్నారు.
దీన్ని మీరు కూడా చూసేయండి.