తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్లలో కత్రినా కైఫ్( Katrina Kaif ) ఒకరు.తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ మల్లీశ్వరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా అల్లరి పిడుగు సినిమాతో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్నారు.
అప్పట్లోనే 75 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం ద్వారా ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైన కత్రినా కైఫ్ త్వరలో టైగర్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.టైగర్3 సినిమాలో కత్రినా కైఫ్ హద్దులు దాటి గ్లామర్ షో చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కిన టైగర్3 ( Tiger 3 )ట్రైలర్ కు 48 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
కత్రినా కైఫ్ వయస్సు ప్రస్తుతం 40 సంవత్సరాలు కాగా వయస్సు పెరుగుతున్నా ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని భోగట్టా.అయితే కత్రినా కైఫ్ బాడీగార్డ్ జీతం హాట్ టాపిక్ అవుతోంది.
కత్రినా కైఫ్ బాడీ గార్డ్ పేరు దీపక్ సింగ్( Deepak Singh ) కాగా ఇతని జీతం ఏడాదికి కోటి రూపాయలు అని తెలుస్తోంది.
దీపక్ సింగ్ గతంలో పలువురు జాతీయ, అంతర్జాతీయ సినీ తారల దగ్గర పని చేశారు.దీపక్ సింగ్ జీతం నెలకు 8 లక్షల రూపాయల కంటే ఎక్కువని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.కత్రినా కైఫ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 77 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
కత్రినా కైఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి ఇతర సెలబ్రిటీలు సైతం షాకవుతున్నారు.