తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ డైరెక్టర్ లలో వెంకటేష్ మహా ( Venkatesh Maha )ఒకరు.ఈయన ప్రస్తుతం ఒక స్టార్ హీరో తో సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇంతకుముందు ఈయన కేరాఫ్ కంచరపాలెం అనే ఒక సినిమా చేశారు.
ఆ సినిమా సూపర్ హిట్ అయింది దాంతో తన నెక్స్ట్ సినిమాగా మలయాళం లో హిట్ అయిన ఒక సినిమాని తెలుగులో రీమేక్ చేయడం జరిగింది ఆ సినిమానే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఇందులో సత్యదేవ్ హీరోగా నటించాడు.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.ఇక దాంతో ఒక మంచి కథ రెడీ చేసుకొని ఇప్పుడు ఒక స్టార్ హీరోని డైరెక్షన్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఈయన ఓ మంచి కథను కూడా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
అప్పట్లో కే జి ఎఫ్ సినిమా పైన సంచలన కామెంట్లు చేసి కాంట్రవర్సీలో నిలిచిన ఈయన కొద్దిరోజుల క్రితమే విజయ్ దేవరకొండ కి ఒక కథ వినిపించినట్టుగా తెలుస్తుంది.అయితే విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) సమంత కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన ఖుషి సినిమా( Kushi Movie ) పెద్దగా ఆడలేదు.
దాంతో విజయ్ వెంకటేష్ మహా కి అవకాశం ఇస్తాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ఈ సినిమా స్టోరీ బాగుండటం తో వెంకటేష్ మహా ( Venkatesh Maha )విజయ్ తనతో సినిమా చేస్తారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.కానీ ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో విజయ్ కి అర్జెంటుగా ఒక హిట్ కావాలి దానికోసం గౌతమ్ తిన్ననూరు తో చేస్తున్న సినిమా హిట్ అయితే తప్ప మళ్లీ మంచి మార్కెట్ అనేది ఏర్పడదు.కాబట్టి విజయ్ గౌతమ్ తిన్ననురి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటేష్ మహా సినిమా ఉండచ్చని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం విజయ్ కెరియర్ డైలమా లో ఉంది కాబట్టి ఇప్పుడు వెంకటేష్ మహా కి ఛాన్స్ ఇచ్చి తను కూడా సాహసం చేయలేడని చెప్పాలి…