తమిళ్ ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.కోలీవుడ్ కు చెందిన నలుగురు టాప్ హీరోలకు రెడ్ కార్డు జారీ చేసింది.
చెన్నైలో తాజాగా జరిగిన నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశంలో నలుగురు హీరోలకు రెడ్ కార్డు జారీ చేయగా వారు ఎవరంటే.ధనుష్, విశాల్, శింబు, అధర్వలకు( Dhanush, Vishal, Simbu , Adharv ) రెడ్ కార్డు జారీ చేసింది.
దీంతో ఈ విషయం తమిళ్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.మరి ఈ నలుగురిపై రెడ్ కార్డు ఎందుకు జారీ చేసింది? అసలు రెడ్ కార్డు జారీ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అంటే.సినీ నిర్మాతలకు సహకరించకుండా, వారికీ వ్యతిరేకంగా ఏదైనా చేయడం వంటి వాటికీ నిర్మాతల మండలి కఠిన చర్యలు తీసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకుంది.
ఈ మేరకు వీరిపై రెడ్ కార్డు( Red card ) జారీ చేసారు.శింబు 60 రోజులు పనిచేస్తానని చెప్పి ఒక సినిమాకు పని చేయక పోవడం వల్ల ఇతడిపై నిర్మాత ఫిర్యాదు చేయడంతో శింబుకు రెడ్ కార్డు జారీ చేసారు.ఇక ధనుష్ కు ఒక సినిమాకు కమిట్ అయ్యి కొన్ని కారణాల వల్ల హాజరు కాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది.
దీంతో ధనుష్ పై నిషేధం విధించింది.
అలాగే మథియాజ్ కజన్( Mathias Kazan ) వివాదం వల్ల అధర్వకు, మాజీ అధ్యక్షుడు విశాల్ తన హయాంలో నిధులు పక్కదోవ పట్టించారనే ఆరోపణలతో విశాల్ కు రెడ్ కార్డు ఇచ్చారు.ఈ రెడ్ కార్ నోటీసులు అందుకున్న వారు కోలీవుడ్( Kollywood ) నిర్మాతలతో కలిసి పని చేయకుండా తాత్కాలికంగా వీరిని నిషేధించడం జరుగుతుంది.కొత్త సినిమా ప్రాజెక్టులను తీసుకునే ముందే వీరంతా తమపై వచ్చిన ఆరోపణలను పరిష్కరించుకోవాలి.
అప్పటి వరకు సినిమాలు చేయడానికి వీలు లేదు.మరి ఈ నలుగురు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.