యూకే ప్రధాని రిషి సునాక్( UK Prime Minister Rishi Sunak ) అక్టోబర్ చివరిలో భారత్ పర్యటనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సందర్భంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై కీలక ముందడుగు పడే అవకాశాలు వున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలోని 26 ఛాప్టర్లలో 24 ఛాప్టర్‌లపై విస్తృత అవగాహనకు వచ్చిన తర్వాత భారత్, బ్రిటీష్ అధికారులు ప్రస్తుతం న్యూఢిల్లీలో 14వ రౌండ్ చర్చలు జరుపుతున్నారు.ఈ చర్చలు సునాక్ పర్యటనతో మరింత ముందుకు సాగే అవకాశం వుందని భావిస్తున్నారు.
మీడియాలో వస్తున్న కథనాలను బట్టి అక్టోబర్ 28న రిషి సునాక్ భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.సునాక్ గనుక భారత్ వస్తే.అది ఆయనకు ఈ ఏడాది ఇండియాకు రెండో పర్యటన.
ఇప్పటికే సెప్టెంబర్‌లో జీ20 సమ్మిట్ నిమిత్తం రిషి సునాక్ ఆయన సతీమణి అక్షతా మూర్తిలు( Akshata Murthy ) భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ( Prime Minister Modi )భేటీ అయిన సునాక్ ఎఫ్‌టీఏపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఆ సమయంలో మరోసారి భారత్‌లో పర్యటించాల్సిందిగా మోడీ చేసిన విజ్ఞప్తికి సునాక్ సానుకూలంగా స్పందించినట్లుగా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
సునాక్ గనుక భారత్ వస్తే .అక్టోబర్ 29న క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా భారత్ – ఇంగ్లాండ్ ( India – England )మ్యాచ్‌ను వీక్షించేందుకు సునాక్ లక్నోకి వెళ్లే అవకాశం వుంది.గతేడాది జరిగిన ఎఫ్‌టీఏ చర్చల సందర్భంగా కొన్ని వివాదాస్పద అంశాలపై ఇరు దేశాలు వెనక్కి తగ్గాయి.
పాల ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాలు, స్కాచ్ విస్కీతో సహా ఐదు రకాల వస్తువులకు సంబంధించి బ్రిటీష్ వర్గాలు భారతీయ మార్కెట్లో చోటును కోరుతున్నాయి.
భారత్ వైపు నుంచి చూస్తే.ఏడాదికి 1,00,000 వర్క్ వీసా పరిమితిని పెంచాలని కోరుతోంది.దీనికి బ్రిటన్ విముఖత చూపుతోంది.
అయితే నైపుణ్యం కలిగిన కార్మికులకు దీర్ఘకాలిక వీసాలు అవసరం లేదు.ఎందుకంటే వారు తక్కువ వ్యవధిలో పనులకే నియమించబడతారని భారత్ వాదిస్తోంది.
నైపుణ్యం కలిగిన కార్మికులను ఉద్యోగాలు మార్చుకోవడానికి అనుమతించడంతో పాటు వ్యాపార సంబంధిత చలనశీలతతో పాటు కార్మిక ప్రమాణాలు, స్థిరమైన వ్యాపార పద్థతులకు సంబంధించిన నిబంధనలపై ఇరుపక్షాలు అవగాహన కుదుర్చుకున్నాయి.యూకేలో 13వ రౌండ్ చర్చలు పూర్తయిన తర్వాత 30 మంది సభ్యులతో కూడిన బ్రిటీష్ ప్రతినిధి బృందం న్యూఢిల్లీకి చేరుకుంది.
వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ గత వారం చర్చల కోసం లండన్‌లో వున్న సంగతి తెలిసిందే.