భూగ్రహం మీద నిప్పుల వానా? అని ఆశ్చర్యపోవద్దు.ఈ కలియుగంలో ఏదన్నా జరగొచ్చు.అవును, ఇపుడు ఇదే విషయాన్ని కొంతమంది ఉద్దండులు నొక్కివక్కాణించి మరీ చెబుతున్నారు.1998లో నిర్మితమైన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను( International Space Station ) ఇప్పటివరకు 20 దేశాలకు చెందిన 250 మందికి పైగా వ్యోమగాములు సందర్శించడం జరిగింది.ఈ ప్రాజెక్టులో డజనుకు పైగా దేశాల భాగస్వామ్యం ఉండగా ప్రచ్ఛన్న యుద్ధం సాగించిన అమెరికా, రష్యా కూడా ఈ జాబితాలో ఉండటం కొసమెరుపు.
ప్రస్తుతం ఈ స్పేస్ స్టేషన్లో ఉన్న హార్డ్వేర్ దశాబ్ధాల కిందటిది.దీనివల్ల అంతరిక్ష కేంద్రం కక్ష్యలో నియంత్రణ కోల్పోవచ్చన్న ఆందోళన చాలామందికి ఇపుడు కలుగుతోంది.అంతరిక్షంలో అలాంటి దుస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ను 2031 నాటికి భూమి మీద కూల్చేయాలి అని కొందరు అంటున్నారు.
కాగా దీనిని పసిఫిక్ మహాసముద్రంలో( Pacific Ocean ) కూల్చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ స్టేషన్ను భూమి మీద కచ్చితంగా ఎక్కడ పడేలా చేయాలో ఆలోచించడమే పెద్ద పని.ఈ సందర్భంగా భూ వాతావరణంలోకి అది వచ్చినప్పుడు పెద్ద పెద్ద వస్తువులు కాలిబూడిదైన అవకాశం ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే 400 టన్నుల వస్తువు ఆకాశం నుంచి పడిపోవడం చిన్న విషయం కాదు.
అయితే దానిని కూల్చడానికి 2030కి మించి పొడిగించడం ప్రమాదకరమని చాలా మంది శాస్త్రవేత్తలు అంటున్నారు.భూమికి 80 కి.మీ.ఎత్తులో మాడ్యూల్ వేల డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరి ముక్కలు కావడం మొదలవుతుంది.అందులోని లోహపు యంత్రాలన్నీ కరిగిపోతాయి.అవి ఉల్కాపాతంలాగా ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ భూమివైపు దూసుకొచ్చినపుడు ఏర్పడిన అగ్గిరవ్వలు ప్రజలను రకరకాల భయబ్రాంతులకు గురి చేస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.